బాసర ట్రిపుల్ ఐటీకి తమిళిసై: విద్యార్ధులతో కలిసి టిఫిన్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులతో తమిళనాడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆదివారం నాడు సమావేశమయ్యారు. విద్యార్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధుల సమస్యలపై ఇంచార్జీ వీసీతో గవర్నర్ చర్చించారు.
హైదరాబాద్: Telangana గవర్నర్ Tamilisai Soundararajan ఆదివారం నాడు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులతో ముఖాముఖి నిర్వహించారు. ఇవాళ్టి నుండి యూనివర్శిటీలను సందర్శనకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శ్రీకారం చుట్టారు.
బాసర ట్రిపుల్ ఐటీలోని హస్టల్ గదులు, పరిసరాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పరిశీలించారు. మెస్ భవనాన్ని కూడా తమిళిసై చూవారు. విద్యార్ధులతో కలిసి తమిళిసై టిఫిన్ చేశారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యా బోధనతో పాటు వసతి సౌకర్యాల గురించి గవర్నర్ తమిళిసై విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్ధులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్ధుల సమస్యలను విన్న గవర్నర్ వీటి పరిష్కారం కోసం కృషి చేస్తానని హమీ ఇచ్చారు. బాసర ట్రిపుట్ ఇంచార్జీ వీసీ వెంకటరమణ సహా పలువురితో గవర్నర్ తమిళిపై విద్యార్ధుల సమస్యలపై చర్చించారు. విద్యార్ధులు ఏకరువు పెట్టిన సమస్యలపై ఆమె అధికారులను అడిగారు.
మెస్ నిర్వహణపై విద్యార్ధులు అసంతృప్తిగా ఉన్నారని గవర్నర్ చెప్పారు విద్యార్ధులు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవేనని గవర్నర్ అభిప్రాయపడ్డారు. నాణ్యమైన భోజనం కావాలని విద్యార్ధులు కోరుతున్నారని గవర్నర్ చెప్పారు. లైబ్రరీ, ల్యాప్ టాప్ లు , స్పోర్ట్స్ కు సంబంధించిన వస్తువులు కావాలని కూడా విద్యారర్ధులు కోరుతున్నారని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు క్యాంపస్ లో కనీస సౌకర్యాల కోసం విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారని గవర్నర్ అభిపరాయపడ్డారు. ఈ విషయమై తాను కూడా అధికారులతో చర్చించనున్నట్టుగా గవర్నర్ వివరించారు.
also read:తెలంగాణ గవర్నర్ తమిళిసై సింప్లిసిటీ.. హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు రైలు ప్రయాణం (ఫోటోలు)
సెక్యూరిటీ కూడా సరిగా లేదని విద్యార్ధులు తమ దృష్టికి తెచ్చినట్టుగా గవర్నర్ తెలిపారు. అతి తక్కువ సమయంలోనే బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్ధుల సమస్యలను తెలుసుకొనే ప్రయత్నం చేశామన్నారు.
మెస్ కాంట్రాక్టర్ ను మార్చాలని డిమాండ్ చేస్తూ 24 గంటల పాటు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. మెస్ లోనే బైఠాయించి విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. ఈ విషయమై ఇంచార్జీ వీసి తో విద్యార్ధులు జరిపిన చర్యలు విజయవంతం కావడంతో ఆగష్టు 1వ తేదీ నుండి క్లాసులకు హాజరౌతున్నారు.
ఈ ఏడాది జూన్ మాసంలో సుమారు వారం రోజుల పాటు విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. జూన్ 20వ తేదీన విద్యార్ధులతో తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించారు. విద్యార్ధుల సమస్యలను పరిష్కరిస్తానని విద్యార్ధులకు మంత్రి హమీ ఇచ్చారు. మంత్రి హామీ ఇచ్చిన తర్వాత కూడా సమస్యలు పరిష్కారం కాలేదని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇక సమస్యలు పరిష్కరించేందుకు సమయం ఇచ్చేది లేదని విద్యార్ధుల తల్లిదండ్రులు కూడ తేల్చి చెప్పారు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్ధులు తమ డిమాండ్ల సాధనకు జూన్ మాసంలో వారం రోజుల పాటు ఆందోళన నిర్వహిచడంతో వారి సమస్యలు ప్రపంచానికి తెలిశాయి. తమ డిమాండ్ల సాధన కోసం విద్యార్ధులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా జూన్ మాసంలో ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే విద్యార్ధుల డిమాండ్లను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని ఇంచార్జీ వీసీ వెంకటరమణ ప్రకటించారు. విద్యార్ధులు కూడా ట్రిపుల్ ఐటీ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.