గవర్నర్ కు ప్రోటోకాల్ పాటించడం మానేశారు: తమిళిపై సౌందర రాజన్ సంచలనం

ప్రోటోకాల్ వివాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులను గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. ట్రిపుల్ ఐటీలో విద్యార్ధుల గదులను , మెస్ లను పరిశీలించారు. విద్యార్ధులతో కలిసి టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.గవర్నర్ కు ప్రోటోకాల్ ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. 

Telangana Governor Tamilisai Soundararajan Sensational Comments On protocol issue


నిర్మల్: Telanganaలో ప్రోటోకాల్ ఎక్కడుందని గవర్నర్ Tamilisai Soundararajan ప్రశ్నించారు. basar iiit, విద్యార్ధులతో ఆదివారం నాడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.  గవర్నర్ కు ప్రోటోకాల్ పాటించడం ఎప్పుడో మానేశారనేది బహిరంగ రహస్యమని తమిళిసై సౌందర రాజన్  చెప్పారు.  ప్రోటోకాల్ విషయాన్ని తాను పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. 

ఈ ఏడాది జూన్ 28వ తేదీన తెలంగాణ చీఫ్  జస్టిస్  ఉజ్జల్ భయాన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్  రాజ్ భవన్ కు వచ్చారు. దాదాపు  తొమ్మిది మాసాల తర్వాత కేసీఆర్ రాజ్ భవన్ కు చేరుకున్నారు. రాజ్ భవన్ లో కేసీఆర్ అప్పుడు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో నవ్వుతూ మాట్లాడారు. ఆ తర్వాత కూడా గవర్నర్ కు ప్రోటోకాల్ విషయంలో ఎలాంటి మార్పు రాలేదు. గోదావరికి వరదలు వచ్చిన సమయంలో భద్రాచలంలో ముంపు బాధిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. ఈ సమయంలో కూడా ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలు తలెత్తాయి. 

గోదావరి వరదలకు క్లౌడ్ బరస్ట్ అనే అనుమానాలున్నాయని  తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గవర్నర్ తమిళిసై సౌందర  రాజన్ తోసిపుచ్చారు. క్లౌడ్ బరస్ట్ జరగలేదన్నార. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆమె న్యూఢిల్లీకి వెళ్లిన సమయంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లబోరన్నారు.అదే విధంగా పలు విషయాల్లో తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య అగాధం పెరుగుతూ వస్తోంది. 

హైద్రాబాద్ జూబ్లీహిల్స్ రేప్ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. అంతేకాదు సరూర్ నగర్ పరువు హత్యకు సంబంధించి కూడా ప్రభుత్వం నుండి నివేదిక కోరారు. అయితే వీటిపై తనకు ప్రభుత్వం నుండి నివేదిక రాలేదని గతంలో గవర్నర్ ప్రకటించిన విషయం తెలిసిందే. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పై మంత్రులు, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. .

ఈ ఏడాది   జూన్ 10వ తేదీన నిర్వహించిన మహిళా దర్బార్ లోకూడా  గవర్నర్  సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఆపే శక్తి లేదని కూడా గవర్నర్ పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తాను పనిచేస్తున్నట్టుగా గవర్నర్ తెలిపారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో కూడా గవర్నర్ భేటీ అయ్యారు.ఈ భేటీ తర్వాత కూడా గవర్నర్  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను అనేక అవమానాలను ఎదుర్కొంటూ గవర్నర్ గా కొనసాగుతున్నట్టుగా చెప్పారు. కొందరు తనను ట్రోల్ చేసిన విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. కేసీఆర్ ను తాను సోదరుడిగా భావించానన్నారు.రాజ్ భవన్ కు ఇచ్చే గౌరవాన్ని ఇవ్వాలన్నారు.  గవర్నర్  చేసిన విమర్శలకు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు కూడా అంతే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. ఇవాళ్టి నుండి గవర్నర్ యూనివర్శిటీల సందర్శనను ప్రారంభించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios