తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లుకు సంబంధించి సర్కార్ ఇచ్చిన వివరణపై గవర్నర్ తమిళిసై సంతృప్తి చెందారు . దీంతో ఆమె బిల్లుపై ఆమోదముద్ర వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లుకు సంబంధించి సర్కార్ ఇచ్చిన వివరణపై గవర్నర్ తమిళిసై సంతృప్తి చెందారు. ఈ నేపథ్యంలో కాసేపట్లో ఆ బిల్లుకు ఆమె ఆమోదం తెలిపే అవకాశాలు వున్నాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా.. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్టీసీ విలీనం బిల్లు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించి అనేక ట్విస్టులు చోటుచేసుకుంటాయి. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ టీఎస్‌ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును పరిశీలించాల్సి ఉందని, కొంత సమయం కావాలని గవర్నర్ కార్యాలయం స్పష్టం చేసింది. ఐదు అంశాలపై ప్రభుత్వం నుంచి గవర్నర్ తమిళిసై వివరణ కోరారు.
ALso Read: ఆర్టీసీ బిల్లు విషయంలో కీలక పరిణామం.. గవర్నర్ అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ..!!
మరోవైపు ఆర్టీసీ యూనియన్ నాయకులను గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చర్చలకు రావాలని రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ఉదయం 11.30 గంటలకు ఆర్టీసీ యూనియన్ నాయకులతో చర్చిస్తామని గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం తాను పుదుచ్చేరిలో ఉండటంతో.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్టీసీ యూనియన్ నాయకులతో మాట్లాడనున్నట్టుగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చెప్పారు. ఈ క్రమంలోనే 10 మంది ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను రాజ్‌భవన్ వర్గాలు లోనికి అనుమంతించాయి.
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆర్టీసీ బిల్లును ఆమోదించకపోతే రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులు నెక్లెస్ రోడ్ నుంచి రాజ్‌భవన్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. అంబేడ్కర్ విగ్రహం, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా రాజ్‌భవన్ చేరుకున్నారు. రాజ్‌భవన్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ బిల్లను గవర్నర్ తమిళిసై ఆమోదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
