విద్యార్ధులకు గ్రేస్ మార్కులు:జేఎన్‌టీయూ విద్యార్ధుల ఆందోళనపై తమిళిసై

జేఎన్‌టీయూ విద్యార్ధుల ఆందోళనపై తాను  వీసీతో చర్చించినట్టుగా గవర్నర్ తమిళిసై  సౌందరరాజన్ చెప్పారు.విద్యార్ధులకు సబ్జెక్ట్ మినహయింపు సాధ్యం కాదని తేల్చి చెప్పారన్నారు.
 

Telangana Governor Tamilisai Soundararajan Reacts on JNTU Students protest

హైదరాబాద్:జేఎన్‌టీయూ  విద్యార్ధుల ఆందోళనను తాను వీసీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. జేఎన్‌టీయూ విద్యార్ధుల ఆందోళన విషయమై తాను వీసీతో మాట్లాడినట్టుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. ఈ విషయమై తనతో చర్చించేందుకు వీసీ రాజ్ భవన్ కు రెండు దఫాలు వచ్చారని ఆమె గుర్తు చేశారు.సబ్జెక్టు మినహయింపులో ఇబ్బందులు విద్యార్ధులకు జరిగే నష్టాన్ని వీసీ వివరించారని చెప్పారు. సబ్జెక్టు మినహాయింపు సాధ్యం కాదని వీసీ తేల్చిచెప్పారన్నారు.అయితే విద్యార్ధులకు  గ్రేస్ మార్కులు పెంచడం సాధ్యమని వీసీ చెప్పారని గవర్నర్ వివరించారు.తన అభ్యర్ధన  మేరకు గ్రేస్ మార్కులు పెంచారని ఆమె తెలిపారు.
విద్యార్ధులు శ్రద్దతో ఆశావాద థృక్పథంతో ముందుకెళ్లాలని ఆమె కోరారు.

యూనివర్శిటీ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై  చర్చించాలని తెలంగాణ విద్యా శాఖ మంత్రిని  కోరారు గవర్నర్ తమిళిసై .ఈ విషయమై ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.ఈ అంశం నిన్ననే గవర్నర్ ప్రభుత్వానికి లేఖ పంపారుఈ  బిల్లును ఆమోదిస్తే న్యాయ పరమైన చిక్కులు వస్తాయా అనే విషయమై తమిళిసై యూజీసీకి కూడా లేఖ రాశారు.యూనివర్శిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గవర్నర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. యూనివర్శిటీల్లో సిబ్బంది భర్తీ విషయమై తెలంగాణ ప్రభుత్వం   యూనివర్శిటీ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లును తెచ్చింది.

కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య గ్యాప్ కొనసాగుతుంది. అసెంబ్లీ పాస్ చేసిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంది.ఈ బిల్లులు ఇంకా గవర్నర్ ఆమోదించలేదు. ఈ బిల్లులపై త్వరలోనే నిర్ణయం  తీసుకొంటానని గవర్నర్ గత మాసం చివరి వారంలో ప్రకటించిన విషయం తెలిసిందే

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios