కొమురవెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు:స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ తమిళిసై
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొమరవెల్లిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారంనాడు తమిళిసై సౌందరరాజన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొమరవెల్లిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారంనాడు ఉదయంప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.కొమురవెల్లి ఆలయానికి వచ్చిన గవర్నర్ కు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రోటోకాల్ వివాదంపై కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని గవర్నర్ చెప్పారు.కొమురవెల్లికి రైల్లే స్టేషన్ కావాలని భక్తులు కోరారన్నారు.వీలైనేంత త్వరగా కొమురవెల్లికి రైల్వేస్టేషన్ వచ్చేలా ప్రయత్నిస్తానని ఆమె హామీ ఇచ్చారు. మరో వైపు గవర్నర్ పర్యటనలో జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు హాజరు కాలేదు.
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ పర్యటనలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు హాజరు కావడం లేదు.తన పర్యటనలో ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ కూడ ప్రకటించారు.తనకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడాన్ని పట్టించుకోవడం లేదని గవర్నర్ ప్రకటించారు. ఇవాళ గవర్నర్ టూరులో కూడ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొనలేదు.నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గవర్నర్ ప్రభుత్వం తీరుపై విమర్శలు చేశారు.తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారోమోననే అనుమానం వ్యక్తం చేశారు. మొయినాబాద్ ఫాం హౌస్ అంశంలో రాజ్ భవన్ ను లాగే ప్రయత్నం చేశారని ఆమె ఆరోపించారు.