తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అటెండర్ రాజు గురువరాం నాడు గుండెపోటుతో మరణించాడు. ఆసుపత్రికి తరలించేలోపుగానే ఆయన మరణించాడు. 

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వద్ద అటెండర్ గా పనిచేసే Raju Heart Attack తో గురువారం నాడు మరణించాడు. సికింద్రాబాద్ పద్మారావునగర్ లోని స్కందగిరి టెంపుల్ లో జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఇవాళ తెలంగాణ గవర్నర్ Tamilisai Soundararajan పాల్గొన్నారు. ఈ సమయంలోనే గవర్నర్ Attender రాజుకి గుండెపోటు వచ్చింది. గవర్నర్ కాన్వాయ్ లోనే రాజును గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే రాజును పరీక్షించిన వైద్యులు అప్పటికే రాజు చనిపోయినట్టుగా ప్రకటించారు..