ఆర్టీసీ విలీన బిల్లు : ఆమోదంపై ప్రతిష్టంభన... మళ్లీ మెలిక పెట్టిన తమిళిసై, మరో 3 వివరాలు కావాలన్న గవర్నర్
తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లుపై ఆమోదానికి సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతోంది. తనకు మరో మూడు వివరాలు కావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ ప్రభుత్వంలో టీఎస్ఆర్టీసీ విలీనానికి సంబంధించిన బిల్లుపై ఆమోదానికి సంబంధించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరో మెలిక పెట్టారు. తనకు మరో మూడు వివరాలు కావాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీకి భూములు, భవనాలు ఎన్ని వున్నాయి, వాటిని ఏం చేస్తారు.. పర్మినెంట్ కానీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా.. డిపోలవారీగా ఆర్టీసీ ఉద్యోగుల సంఖ్య ఎంత అనే వివరాలు తనకు తెలియజేయాలని తమిళిసై కోరారు. ఉద్యోగుల ప్రయోజనాల కోసమే మరిన్ని వివరాలు కోరానని గవర్నర్ చెప్పారు. దీంతో గవర్నర్ అడిగిన సమాధానాన్ని అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.