టీఎస్ఆర్టీసీ బిల్లు: న్యాయ సలహా కోరిన తమిళిసై

టీఎస్ఆర్టీసీ బిల్లును  న్యాయశాఖ సలహా కోసం పంపారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను కూడ న్యాయశాఖకు పంపింది గవర్నర్ తమిళి సై.

Telangana Governor  Tamilisai Soundarajan sents  TSRTC Bill To Law Secretary lns

హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ బిల్లుపై న్యాయశాఖ సలహా కోరింది తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఈ మేరకు  రాజ్ భవన్  గురువారంనాడు ప్రకటించింది. టీఎస్ఆర్టీసీ బిల్లుపై  న్యాయశాఖ సిఫారసుల ఆధారంగా గవర్నర్ తదుపరి చర్యలు తీసుకుంటారని రాజ్ భవన్ ప్రకటించింది. ఆర్టీసీ బిల్లుపై  దురుద్దేశ్యంతో చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని గవర్నర్ కోరినట్టుగా  రాజ్ భవన్ తెలిపింది. ఈ విషయమై  వాస్తవాలు తెలుసుకోవాలని  ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలను కోరారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఆర్టీసీ బిల్లుతో పాటు  ఇతర బిల్లులను కూడ న్యాయ శాఖ కార్యదర్శికి  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పంపారు.

గతంలో  వెనక్కి  పంపిన బిల్లులపై  చేసిన సిఫారసుల గురించి గవర్నర్ అడిగారు. తన సిఫారసులను  పరిగణనలోకి తీసుకున్నారా లేదా నిర్ధారించాలని న్యాయశాఖను  కోరారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. నిబంధనలకు  లోబడే బిల్లులను  న్యాయ శాఖ కార్యదర్శికి  పంపినట్టుగా రాజ్ భవన్ వర్గాలు ఆ ప్రకటనలో వివరించాయ.  రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్, సచివాలయ నిబంధనలకు  లోబడి న్యాయ శాఖ సలహా కోసం పంపినట్టుగా  రాజ్  భవన్ వివరించింది. బిల్లులను  న్యాయ శాఖ కార్యదర్శికి  పంపడం సాధారణమని  రాజ్ భవన్ తెలిపింది. ఈ విషయమై  వాస్తవాలు తెలుసుకోవాలని  ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలను కోరారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. ఆర్టీసీ బిల్లుతో పాటు  ఇతర బిల్లులను కూడ న్యాయ శాఖ కార్యదర్శికి  గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పంపారు.

గతంలో  వెనక్కి  పంపిన బిల్లులపై  చేసిన సిఫారసుల గురించి గవర్నర్ అడిగారు. తన సిఫారసులను  పరిగణనలోకి తీసుకున్నారా లేదా నిర్ధారించాలని న్యాయశాఖను  కోరారు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. నిబంధనలకు  లోబడే బిల్లులను  న్యాయ శాఖ కార్యదర్శికి  పంపినట్టుగా రాజ్ భవన్ వర్గాలు ఆ ప్రకటనలో వివరించాయ.  రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్, సచివాలయ నిబంధనలకు  లోబడి న్యాయ శాఖ సలహా కోసం పంపినట్టుగా  రాజ్  భవన్ వివరించింది. బిల్లులను  న్యాయ శాఖ కార్యదర్శికి  పంపడం సాధారణమని  రాజ్ భవన్ తెలిపింది. 

also read:టీఎస్ఆర్టీసీ బిల్లు: ఆమోదం తెలిపిన తమిళిసై , సర్కార్‌కు పది సిఫారసులు

ఈ నెల  6వ తేదీన టీఎస్ఆర్టీసీ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి  గవర్నర్ అదే రోజున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ బిల్లుపై  తనకున్న సందేహలపై  రాష్ట్రప్రభుత్వాన్ని రెండు విడతలుగా వివరణ కోరారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్. గవర్నర్ లేవనెత్తిన ప్రశ్నలకు  రాష్ట్రప్రభుత్వం సమాధానం ఇచ్చింది.  ఈ నెల  6వ తేదీన  మధ్యాహ్నం తెలంగాణ ఆర్టీసీ అధికారులు,  రవాణాశాఖాధికారులు గవర్నర్ తో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో గవర్నర్ తన  సందేహలను నివృత్తి చేసుకున్నారు. మరో వైపు  ఆర్టీసీ బిల్లుపై  ప్రభుత్వానికి పలు సిఫారసులను  గవర్నర్ చేశారు.తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను  ప్రభుత్వంలో విలీనం చేయాలని  కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే  గత  నెల  31న నిర్వహించిన కేబినెట్ లో ఈ ఈబిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios