తెలంగాణ గవర్నర్ నరసింహన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.  నరసింహన్ ఇటీవల తన భార్య విమలతో కలిసి బీహార్ రాష్ట్రంలోని గయ పర్యటనకు వెళ్లారు. కాగా... అక్కడ సోమవారం అస్వస్థతకు గురైనట్లు సమాచారం. సోమవారం అనారోగ్యం కారణంగా ఆయన వాంతులు చేసుకున్నట్లు తెలిసింది. దీంతో ఆయనను సమీపంలోని హాస్పిటల్ కి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

ముందు జాగ్రత్తగా రక్త పరీక్ష, ఈసీజీ నిర్వహించారు. ఎలాంటి సమస్య లేదని నిర్థారించిన తర్వాత గవర్నర్ అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఆయన హైదరాబాద్ చేరకునే అవకాశం ఉంది.