2022 ఆర్ధిక సంవత్సరంలో రూ. 76 వేల పంట రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
హైదరాబాద్: 2022 ఆర్ధిక సంవత్సరంలో రూ. 75 వేల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao సోమవారం నాడు Telangana Budget 2022 ను ప్రవేశ పెట్టారు ఎన్నికల మేనిఫెస్టోలో crop loan మాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హమీ ఇచ్చింది. అయితే ఈ హామీ మేరకు తెలంగాణ ప్రభుత్వం విడతల వారీగా రుణాలను మాఫీ చేస్తుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 35.52 లక్షల మంది Farmers చెందిన రూ. 16,144 కోట్ల పంట రుణాలను మాఫీ చేసినట్టుగా మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఇప్పటివరకు 5.12 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ఏడాది మార్చి వరకు రూ. 50 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. ఏప్రిల్ నుండి రూ. 75 వేల లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని మంత్రి వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోని రైతాంగం సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశ పెట్టిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రైతు బంధు , రైతు భీమా వంటి పథకాలను అమలు చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో పాలకులు వ్యవసాయంపై నిర్లక్ష్యాన్ని చూపారని మంత్రి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
