హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్పరాజ్ అహ్మాద్‌పై తెలంగాణ సర్కార్  బదిలీ వేటు వేసే అవకాశం ఉంది. గద్వాల జిల్లా కలెక్టర్‌‌ శశాంకను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసే అవకాశం ఉందని సమాచారం.

Also read:నా ఫోన్‌ను కూడ ట్యాప్ చేసి ఉండొచ్చు: ఎంపీ బండి సంజయ్

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్, జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మాద్‌ మధ్య జరిగిన ఆడియో సంభాషణ ఇటీవల కాలంలో బయటకు వచ్చింది.ఈ ఆడియో సంభాషణపై రాజకీయవర్గాల్లో పెద్ద దుమారం రేగింది.

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో తాను జరిపిన ఫోన్ సంభాషణ కట్ చేసి బయటకు లీక్ చేశారని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మాద్ అభిప్రాయపడ్డారు.ఈ ఘటనపై ఆయన పోలీసులకు కూడ ఫిర్యాదు చేశారు.

Also read:బండి సంజయ్‌తో మాట్లాడా: కలెక్టర్ సర్పరాజ్ అహ్మద్, సీఎంఓ ఆరా

ఈ ఆడియో టేపు సంభాషణపై జిల్లా మంత్రి గంగుల కమలాకర్ సీరియస్‌గా స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ  చేయాలని ఆయన కోరారు.ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయమై ఉన్నతాధికారులకు  కలెక్టర్ సర్పరాజ్ అహ్మాద్ వివరణ కూడ ఇచ్చారు. ఈ ఘటనపై తెలంగాణ సీఎస్ ఎస్‌కె జోషీ విచారణ జరిపారు. సర్పరాజ్ అహ్మాద్‌పై బదిలీ వేటు వేయాలని  నిర్ణయం తీసుకొన్నారు.

సర్పరాజ్ అహ్మాద్‌ స్థానంలో గద్వాల జిల్లా కలెక్టర్‌గా ఉన్న శశాంకను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా  నియమించే అవకాశం ఉందని సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్ అహ్మాద్‌కు మంచి సంబంధాలు లేవనే ప్రచారం కూడ ఉంది.

గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  కరీంనగర్  అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్, టీఆర్ఎస్ అభ్యర్ధిగా గంగుల కమలాకర్ పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు తర్వాత కలెక్టర్ సర్పరాజ్ అహ్మాద్‌తో బండి సంజయ్ ఫోన్లో మాట్లాడారు. ఈ ఆడియో సంభాషణ లీకైంది. 

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో  కరీంనగర్ ఎంపీ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్  పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్ధి బోయినపల్లి వినోద్‌కుమార్‌పై పోటీ చేసి విజయం సాధించారు.సంజయ్‌ ఎంపీగా విజయం సాధించిన తర్వాత ఈ వీడియో లీకైంది.