హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా  20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటి పథకానికి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం నాడు శ్రీకారం చుట్టనుంది.

ప్రతి నల్లా(కుళాయి)కి మీటర్లను తెలంగాణ ప్రభుత్వం అనుసంధానించనుంది. ప్రతి కుళాయికి నీటి మీటర్లను విధిగా ఏర్పాటు చేసుకోవాలనని ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

ప్రతి నల్లాకు నీటి మీటర్లను ఈ ఏడాది మార్చిలోపుగా ఏర్పాటు చేసుకోవాలని హైద్రాబాద్ మెట్రో వాటర్ బోర్డు సూచించింది.ఈ మేరకు జలమండలి ప్రత్యేకంగా ఏజెన్సీలను ఏర్పాటు చేసింది. 

నీటి మీటర్ల ఆధారంగా ఎవరు ఎంత నీటిని వినియోగించుకొన్నారనే అంశాన్ని అధికారులు తేల్చనున్నారు. వాటర్ బోర్డు కస్టమర్ రిలేషిప్ మేనేజ్ మెంట్ కేంద్రాలను జలమండలి ఏర్పాటు చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్ నుండి మంచినీటి బిల్లులను జారీ చేస్తారు. 20 వేల లోపు నీటిని వినియోగించుకొన్నవారికి ఉచిత పథకం వర్తించనుంది. 20 వేల లీటర్లు దాటినవారి నుండి డబ్బులు వసూలు చేస్తారు.

జీహెచ్ఎంసీ పరిధిలో 10 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఈ పథకం ద్వారా సుమారు 70 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది.