Asianet News TeluguAsianet News Telugu

ఏసీబీ కేసు:మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ సహా నలుగురి సస్పెన్షన్

ఎన్ఓసీ జారీ చేయడానికి లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన నలుగురు రెవిన్యూ అధికారులపై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసింది.
 

Telangana Government suspends four revenue officers in ACB case
Author
Hyderabad, First Published Sep 16, 2020, 4:31 PM IST


హైదరాబాద్: ఎన్ఓసీ జారీ చేయడానికి లంచం తీసుకొంటూ ఏసీబీకి చిక్కిన నలుగురు రెవిన్యూ అధికారులపై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసింది.
మెదక్ జిల్లాలోని చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ‌ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ చేశాడు అడిషనల్ కలెక్టర్ నగేష్. ఈ విషయంలో రూ. 40 లక్షలు లంచం తీసుకొంటూ నగేష్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. 

also read:రూ. 40 లక్షల లంచం కేసు: తెరపైకి మాజీ కలెక్టర్ పాత్ర, ఏసీబీ విచారణ

ఈ కేసులో ఆర్డీఓ అరుణారెడ్డి, తహాసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ అహ్మద్ ను  ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఈ నలుగురు అధికారులు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ లో ఉన్న ఈ నలుగురిని కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

ఈ కేసులో ఈ నెల 9వ తేదీన నగేష్ సహా నలుగురిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీ ద్వారా లంచం డబ్బులను తీసుకొంటున్నట్టుగా ఏసీబీ గుర్తించింది.

Follow Us:
Download App:
  • android
  • ios