వాహనదారులకు సర్కారు షాక్.. వాహనాల పొల్యూషన్ టెస్టింగ్ ఫీజులు పెంపు
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం వాహనాల కాలుష్య తనిఖీ రేట్లను పెంచింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ (పీయూసీ) జారీ, టెస్టింగ్ ఛార్జీల సవరణను ఏడేళ్ల క్రితం సవరించారు. మళ్లీ ఇప్పుడు వాహనాలకు పొల్యూషన్ టెస్టింగ్ ఫీజులను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
vehicle pollution check rates: వాహనదారులకు తెలంగాణ సర్కారు షాక్ ఇచ్చింది. వాహనాల కాలుష్య నియంత్రణ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ (పీయూసీ) జారీ, టెస్టింగ్ ఛార్జీల సవరణను ఏడేళ్ల క్రితం సవరించారు. మళ్లీ ఇప్పుడు వాహనాలకు పొల్యూషన్ టెస్టింగ్ ఫీజులను పెంచింది.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణలో వాహనాలకు పొల్యూషన్ టెస్టింగ్ ఫీజులను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడేళ్ల క్రితం ఈ రేటును సవరించినందున పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ (పీయూసీ) టెస్టింగ్, జారీకి ఫీజు పెంచాలని హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ ప్రతిపాదించారు. పెరిగిన పెట్టుబడి వ్యయం, జీతభత్యాలు, నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ప్రభుత్వం పరిశీలించి అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.
వాహనాల పొల్యూషన్ టెస్టింగ్ కొత్త రేట్లు ఇలా ఉన్నాయి..
వాహనాలు | ఫీజు |
పెట్రోల్ ద్విచక్రవాహనం | రూ.50 |
పెట్రోల్ త్రిచక్ర వాహనం | రూ.60 |
పెట్రోల్ ఫోర్ వీలర్ | రూ.75 |
డీజిల్ ఫోర్ వీలర్ | రూ.100 |
డీజిల్ ఇతర వాహనాలు | రూ.100 |
గతంలో వాహన పొల్యూషన్ టెస్టింగ్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ జారీకి పెట్రోల్ ద్విచక్రవాహనం రూ.30, పెట్రోల్ త్రీ వీలర్ రూ.50, డీజిల్ ఫోర్ వీలర్ రూ.60గా ఉండేది.