హుజూరాబాద్ లో దళితబంధు.. రూ. 500 కోట్లు విడుదల..
ఈ క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ.500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ దళిత బంధు పథకం అమలు కానుంది.
హైదరాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా దళితులను వ్యాపారులుగా మార్చేందుకు దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్నారు ముఖ్యమంత్రి.
ఈ క్రమంలో హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ.500 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ దళిత బంధు పథకం అమలు కానుంది.
ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని హుజూరాబాద్ వేదికగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మంత్రులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న వాసాలమర్రి దళితుల కోసం ఈ పథకం కింద రూ.7.60 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కాగా హుజూరాబాద్ శాసనసభ ఉప ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి దళిత బంధు అమలు చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాఖ్యలు వినిపించాయి. దీంతో తొలుత వాసాలమర్రి గ్రామానికి తొలుత దళిత బంధు నిధులను కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది.