గురుకుల డిగ్రీ కాలేజీల్లో 863 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

First Published 20, Jun 2018, 5:42 PM IST
telangana government release new job notification
Highlights

గురుకుల బోర్డు ద్వారా నియామక ప్రక్రియ

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగలకు మరో శుభ వార్త అందించింది. ఇప్పటికే పలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి భారీగా నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం తాజాగా గురుకుల డిగ్రీ కళాశాలల్లో కొత్త పోస్టులను మంజూరు చేసింది.

గురుకుల డిగ్రీ కాలేజీల్లో 863 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 616 లెక్చరర్లు, 15 ప్రిన్సిపల్ పోస్టులతో సహా పలు పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. ఈ పోస్టులన్నింటిని గురుకుల బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటికే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవడంతో నిరుద్యోగులు ప్రిపేరవుతున్నారు. అయితే డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మాత్రం ప్రభుత్వంపై కాస్త గుర్రుగా ఉన్నారు.  అయితే తాజా నిర్ణయంతో వారు కాస్త శాంతించే అవకాశం ఉంది.

 


 

loader