రెవిన్యూ రాబడుల్లో 50 శాతం వేతనాలు, వడ్డీలకే: అసెంబ్లీలో కాగ్ రిపోర్టు పెట్టిన ప్రభుత్వం
కాగ్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ రాబడుల్లో 50 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులకే ఖర్చు చేస్తున్నారని కాగ్ తెలిపింది. 2021-22 ఆర్ధిక సంవత్సరం అకౌంట్స్ పై కాగ్ నివేదికను ప్రభుత్వం ఆదివారంనాడు ప్రవేశ పెట్టింది.
11 గ్రాంట్లకు రూ. 75 వేల కోట్లు అధికంగా ప్రభుత్వం వ్యయం చేసిందని కాగ్ తెలిపింది. నీటిపారుదల, వైద్య, ఆరోగ్య, పంచాయితీరాజ్ శాఖలకు 34 శాతం అధికంగా ఖర్చు చేసినట్టుగా కాగ్ నివేదిక ప్రకటించింది.
గృహ నిర్మాణం, పరిశ్రమల శాఖలకు కేటాయింపుల కంటే తక్కువగా ఖర్చు చేసినట్టుగా కాగ్ తెలిపింది. 289 రోజుల పాటు స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ వినియోగించినట్టుగా కాగ్ ప్రకటించింది. 100 రోజుల పాటు రూ. 22, 669 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ నకు ప్రభుత్వం వెళ్లిందని కాగ్ తెలిపింది. 2020-21 లో రూ. 9,335 కోట్ల రెవిన్యూ లోటుకు రాష్ట్రం వెళ్లిన విషయాన్ని కాగ్ అభిప్రాయపడింది.