Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో పెన్షన్ పెంపు: ఎప్పటి నుండి అమలు కానుంది?

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం  హామీల అమలుపై  కేంద్రీకరించింది.

Telangana government plans to hike Aasara Pension soon lns
Author
First Published Jan 23, 2024, 3:50 PM IST

హైదరాబాద్: తెలంగాణలో  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం  ఎన్నికల సమయంలో  ఇచ్చిన హామీల అమలుపై  ఫోకస్ పెట్టింది.   ప్రభుత్వంలోకి వచ్చిన వంద రోజుల్లో  హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే  ఇప్పటికే  రెండు హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది.  

 మహాలక్ష్మి పథకంలో భాగంగా  రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ,  మహిళలకు ప్రతినెల  రూ. 2500  విడుదల చేయడంపై  అనుముల రేవంత్ రెడ్డి సర్కార్  ఫోకస్ పెట్టిందనే ప్రచారం సాగుతుంది.ఈ  విషయమై సీఎం రేవంత్ రెడ్డి  అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా  ప్రచారం సాగుతుంది. 

మరో వైపు పెన్షన్ ను ప్రతి నెల రూ. 4 వేలు చెల్లిస్తామని  కాంగ్రెస్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది.  అయితే  అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి  ఆశాజనకంగా లేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో  ఆర్ధిక పరిస్థితిపై  శ్వేత పత్రం విడుదల చేసింది.  విద్యుత్ రంగంపై కూడ శ్వేత పత్రం  ఇచ్చింది సర్కార్. 

అయితే  ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా  వనరుల సమీకరణపై  కూడ ప్రభుత్వం కేంద్రీకరించిందనే ప్రచారం కూడ లేకపోలేదు.రాష్ట్రంలో  15,98,729 మంది వృద్దులున్నారు. 5,03,613 మంది దివ్యాంగులు,  37,145 మంది  చేనేత కార్మికులు, 1,42,394 మంది  ఒంటరి మహిళలు, 15,60,707 మంది వితంతువులు,65, 307 మంది  గీత కార్మికులున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా  43,96,667 మందికి  పెన్షన్లను అందిస్తున్నారు. తాజాగా  మరో 24 లక్షల మంది  కొత్తగా పెన్షన్ కోసం ధరఖాస్తు చేసుకున్నారు.

  ప్రతి నెలా ప్రస్తుతం అందిస్తున్న  పెన్షన్ కోసం కనీసం  రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది.  రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో  సాధారణ పెన్షన్ రూ. 2016,  దివ్యాంగులకు  రూ. 3016 పెన్షన్ ఇచ్చేవారు. అయితే  కాంగ్రెస్ పార్టీ ఈ పెన్షన్ ను పెంచుతామని హామీ ఇచ్చింది. దివ్యాంగుల పెన్షన్లను  రూ. 6 వేలు ఇస్తామని  హామీ ఇచ్చింది. భారత రాష్ట్ర సమితి మాత్రం ప్రతి ఏటా పెన్షన్ ను పెంచుతామని హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్నట్టుగా  ఏటా  పెన్షన్ పెంచుతున్న విధానాన్ని అమలు చేస్తామని ఎన్నికల హామీలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారు.  కానీ  ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓటమి పాలైంది.

అయితే  కాంగ్రెస్ పార్టీ  అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హమీలపై  ఫోకస్ పెట్టింది.  ప్రజా పాలన పేరుతో ప్రజల నుండి  ఆరు హామీల అమలు విషయమై ప్రజల నుంది ధరఖాస్తును స్వీకరించింది.ఈ ధరఖాస్తులను డేటా  ఎంట్రీ చేశారు. ఈ డేటా ఆధారంగా అధికారులు  క్షేత్ర స్థాయిలో  పరిశీలన చేయనున్నారు.  ఈ పరిశీలన పూర్తైన తర్వాత లబ్దిదారుల ఎంపిక చేసే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే  ఫిబ్రవరి మాసంలో కూడ  పాత పెన్షన్ ను అమలు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. పెంచిన పెన్షన్ విషయమై  ఇంకా అధికారులకు ఇంకా స్పష్టత రాలేదు. పెన్షన్ పెంపు విషయమై  వచ్చే నెల మొదటి వారంలో ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  

also read:గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై తమిళిసై నిర్ణయం: ఆశావాహులకు నిరాశ

ఇప్పటికే  భారత రాష్ట్ర సమితి  నేతలు కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.  విద్యుత్ బిల్లులు చెల్లించవద్దని  కేటీఆర్ ప్రజలను కోరారు.  అమలు చేయలేని హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని భారత రాష్ట్ర సమితి  విమర్శలు చేసింది.  ఈ హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆ పార్టీ విమర్శలు చేస్తుంది. అయితే  అధికారం చేపట్టిన మరునాటి నుండే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడంపై  కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది.

also read:గుడ్ న్యూస్: తెలంగాణ నుండి అయోధ్యకు ఈ నెల 29 నుండి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన బీజేపీ

థావోస్ పర్యటన నుండి వచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  ప్రజలకు ఇచ్చిన హామీలపై ఫోకస్ పెట్టనున్నారు.  పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే నాటికి అమలు చేయాలని  రేవంత్ రెడ్డి సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది.ఈ విషయమై  కాంగ్రెస్ సర్కార్ కసరత్తు చేస్తుందని చెబుతున్నారు.ఒకవేళ హామీలు అమలు చేయలేకపోతే  ప్రత్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అవకాశాన్ని ఇచ్చినట్టు  అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios