Asianet News TeluguAsianet News Telugu

వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు తీర్పు: సుప్రీంకి వెళ్లే యోచనలో కేసీఆర్ సర్కార్


ట్యాంక్‌బండ్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని  తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. మంగళవారం నాడు సుప్రీంకోర్టులో కేసీఆర్ సర్కార్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే ఛాన్స్ ఉంది.

Telangana Government plans to file SLP in Supreme court over vinayaka idol immersion at Hussainsagar
Author
Hyderabad, First Published Sep 13, 2021, 8:32 PM IST

హైదరాబాద్:  ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును  ఆశ్రయించాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది.ఈ  తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. దీంతో తెలంగాణ సర్కార్  ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది.

also read:షాక్: వినాయక విగ్రహల నిమజ్జనంపై తెలంగాణ సర్కార్ రివ్యూ పిటిషన్ కొట్టివేత

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 14న తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.వినాయక విగ్రహలు, దుర్గామాత విగ్రహల నిమజ్జనం  చేయకూడదని న్యాయవాది వేణుమాధవ్ పిల్ దాఖలు చేశారు.ఈ విషయమై విచారణ నిర్వహించిన హైకోర్టు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహల నిమజ్జనంపై ఆంక్షలు విధించింది.

 ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారు చేసిన వినాయక విగ్రహలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయవద్దని ఆదేశించంది. చిన్న విగ్రహలు, పర్యావరణానికి ఇబ్బంది కల్గించని విగ్రహలను రబ్బర్ బండ్ ఏర్పాటు చేసి విగ్రహలను నిమజ్జనం చేయాలని హైకోర్టు ఆదేశించింది.

దీంతో హైద్రాబాద్ పోలీసులు గణేష్ నిమజ్జన ఉత్సవ కమిటీకి నోటీసులు జారీ చేశారు. హుస్సేన్ సాగర్ లో  వినాయక విగ్రహలను నిమజ్జనం చేయవద్దని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ప్రభుత్వంపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. గత ఏడాది వినాయక విగ్రహల నిమజ్జనం సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వులను  పాటించలేదని  ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ ఒక్క మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను యధావిధిగా అమలు చేయాలని కూడ హైకోర్టు ఆదేశించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios