Asianet News TeluguAsianet News Telugu

హాస్టల్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్: స్వంత గ్రామాల్లో పరీక్షలు రాయొచ్చు

ప్రైవేట్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్న హాస్టల్స్ ఉండే విద్యార్థుల కోసం  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.
 

telangana government permits hostel students to write tenth exams in home town
Author
Hyderabad, First Published Jun 5, 2020, 5:18 PM IST


హైదరాబాద్: ప్రైవేట్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్న హాస్టల్స్ ఉండే విద్యార్థుల కోసం  తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది.

విద్యార్థులు తమ గ్రామాల్లోనే టెన్త్ పరీక్షలు రాసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.విద్యార్థుల వివరాలను ఆయా జిల్లాల డీఈవోలకు పంపాలని విద్యాశాఖ ఆదేశించింది.

టెన్త్ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఈ మేరకు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదికను ఇచ్చింది.. టెన్త్ పరీక్షల నిర్వహణ విషయమై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. 

also read:ప్రైవేట్ స్కూల్స్ హాస్టల్స్‌కు అనుమతి: టెన్త్ పరీక్షలపై హైకోర్టుకు తెలంగాణ సర్కార్
 
ప్రైవేట్ స్కూల్స్ కు అనుబంధంగా ఉన్న హాస్టల్స్ ను తెరిచేందుకు కూడ అనుమతి ఇస్తామని ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. పరీక్షలు ప్రారంభమైతే ప్రతి ఐదు రోజులకు ఓసారి పరీక్షల నిర్వహణపై సమీక్షను నిర్వహిస్తామని హైకోర్టు తేల్చి చెప్పింది.

telangana government permits hostel students to write tenth exams in home town

మరో వైపు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే అభ్యర్ధులను రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణిస్తారా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయమై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకొంటామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు ఇవాళ తెలిపారు. ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.

telangana government permits hostel students to write tenth exams in home town

హైకోర్టు విచారణ పూర్తైన తర్వాత హాస్టల్స్ ఉండే విద్యార్థులు తమ స్వంత గ్రామాల్లోనే పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios