హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది. ఈ నెల 8వ తేదీ నుండి రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకొంది. సాంకేతిక సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.

సోమవారం నాడు సాయంత్రం ప్రగతి భవన్ లో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త రెవిన్యూ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఆ తర్వాత ఈ బిల్లును శాసనససభలో పెట్టనున్నారు.కొత్త రెవిన్యూ చట్టం తీసుకొస్తున్నందున వీఆర్ఓ వ్యవస్థకు రద్దు పలుకుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:కొత్త రెవిన్యూ చట్టం: వీఆర్ఓ వ్యవస్థ రద్దుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం

ఈ తరుణంలోనే రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించినట్టుగా చెబుతున్నారు. కానీ సాంకేతిక సమస్యలే ఇందుకు కారణంగా కొందరు అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని రకాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి.

స్టాంప్స్ అంండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రేపటి నుండి సెలవులు ఇస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సెవలను ప్రకటించింది ప్రభుత్వం.

వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడంతో  రిజిస్ట్రేషన్లను రేపటి నుండి రద్దు చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పటికే చలాన్లు చెల్లించినవారికి ఇవాళ రిజిస్ట్రేషన్లు చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

గత వారం రోజుల క్రితమే అనధికార లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు భూముల క్రమబద్దీకరణ చేసుకోవాలని ప్రభుత్వం జీవోను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా  గ్రామ పంచాయితీ నుండి నగరాల వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.