హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కొరకరానికొయ్య మాదిరిగా తయారయ్యారు. మహిళా ప్రజా ప్రతినిధుల భర్తల పెత్తనంపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై గవర్నర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ లేఖపై ప్రభుత్వం చర్యలు తీసుకొంది.

తెలంగాణ రాష్ట్రంలోని పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్న చోట వారి భర్తలు, బంధువులు పెత్తనం చెలాయిస్తున్నారని గవర్నర్ కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదుపై తమిళిసై కేసీఆర్ ప్రభుత్వానికి లేఖ రాశారు.

గవర్నర్ లేఖపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్న చోట  భర్తలు, బంధువులు పాల్గొనకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అధికారిక కార్యక్రమాలు, సమావేశాల్లో మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొనకుండా చూడాలని పంచాయితీరాజ్ శాఖ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తమిళిసై అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.