పెండింగ్ చలాన్లపై నేటీనుండే రాయితీ: తెలంగాణ సర్కార్ జీవో జారీ

వాహనాల  పెండింగ్ చలాన్లపై తెలంగాణ సర్కార్ మరోసారి రాయితీని కల్పించింది. 

 Telangana government issues Government Order discount on pending challans lns

హైదరాబాద్:  వాహనాల పెండింగ్ చలాన్లకు  తెలంగాణ ప్రభుత్వం  భారీ రాయితీని కల్పించింది. ఈ మేరకు  మంగళవారం నాడు తెలంగాణ ప్రభుత్వం  జీవో జారీ చేసింది. నేటి నుండే పెండింగ్ చలాన్ల రాయితీని కల్పించనుంది ప్రభుత్వం.టూ వీలర్స్, మూడు చక్రాల వాహనాలపై 80 శాతం, కార్లపై  50 శాతం, హెవీ వెహికల్స్ పై 60 శాతం రాయితీ,   ఆర్టీసీ బస్సులు, ఇతర భారీ వాహనాలపై  పెండింగ్ చలాన్లపై రాయితీని ప్రకటించింది తెలంగాణ సర్కార్.

ఇవాళ్టి నుండి  2024 జనవరి 10వ తేదీ వరకు  పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చును.ఈ మేరకు  తెలంగాణ రవాణా శాఖ  ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవో జారీ కావడం తొలిసారి.  

గత ఏడాదిలో కూడ పెండింగ్ చలాన్లపై  డిస్కౌంట్  ను ప్రకటించింది. రూ. 300 కోట్ల వరకు  పెండింగ్ చలాన్ల కింద వసూలైంది. ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించే వారిపై  ట్రాఫిక్ పోలీసులు  చలాన్లు విధిస్తున్నారు. ఆన్ లైన్ లో  వాహనదారులకు  చలాన్లను విధిస్తున్నారు. వాహన దారుల ఇంటికే  నేరుగా  ఈ చలాన్లు చేరుతున్నాయి. పెండింగ్ చలాన్లు భారీగా పెరిగిపోవడంతో  డిస్కౌంట్ ను  ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 

ఆన్ లైన్ లో ఈ డిస్కౌంట్లను చెల్లించవచ్చని  ప్రభుత్వం తెలిపింది. అయితే  ఇవాళ  ఉదయం మాత్రం డిస్కౌంట్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని  సంబంధిత అధికారులు తెలిపినట్టుగా సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొన్నారు.  అయితే మధ్యాహ్ననికి ఈ విషయమై  అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో  పెండింగ్ చలాన్ల చెల్లించే వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios