Ration Card E-KYC: రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. మరోసారి ఈ-కేవైసీ గడువు పొడిగింపు.. లాస్ట్‌డేట్‌ ఎప్పుడంటే..?

Ration Card E-KYC: రేషన్‌కార్డు (Ration Card) దారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్‌కార్డు కేవైసీ (Ration Card E-KYC)ప్రక్రియను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. చివరి తేదీని మరోసారి పొడిగించింది. ఇంతకీ రేషన్‌కార్డుల ఈ-కేవైసీ లాస్ట్‌డేట్‌ ఎప్పుడంటే.?

Telangana government extends deadline for ration card e-KYC till the end of February KRJ

Ration Card E-KYC: రేషన్‌కార్డు (Ration Card) లబ్ధిదారులకు శుభవార్త. రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తూ.. తెలంగాణ సర్కార్ గడువును పొడిగించింది. ముందుగా నిర్ణయించిన గడువు ప్రకారం.. జనవరి 31వ తేదీతో అంటే.. ఈ నెల 31 తేదీతో రేషన్ కార్డు ఈ - కేవైసీ గడువు  ముగియనుంది. కానీ, గత రెండు నెలలుగా రేషన్ షాపుల్లో E-KYC అప్‌డేట్ చేస్తున్నా కొన్ని రేషన్‌ షాపుల దగ్గర భారీ లైన్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. దీంతో అప్‌డేట్‌ చేసుకోవడానికి రేషన్ కార్డుదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

మరి కొందరైతే.. కేవైసీ చేసుకోవడానికే ముందుకు రావడం లేదు. దీంతో ఫిబ్రవరి చివరి వరకు అంటే.. ఫిబ్రవరి 29వ తేదీ వరకు ఈ-కేవైసీ చేసుకొచ్చని తెలంగాణ పౌరసరఫరాల శాఖ పేర్కొంది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. KYC అప్‌డేట్ కోసం ఆధార్ ధృవీకరణ, వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారు వెంటనే చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ-కేవైసీ పూర్తి కాకపోతే రేషన్ సరుకులు కోత పెట్టే అవకాశం లేకపోలేదు. ఇలా మరోసారి గడువుపెంచడంతో మరో నెలరోజుల పాటు అవకాశం వచ్చింది..

వాస్తవానికి 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు.. అంటే గత తొమ్మిదేండ్లలో ఎంతోమంది చనిపోరు. మరికొందరు కొత్తగా పెండ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. మరికొందరు పెండ్లి తర్వాత వేరుగా ఉంటున్నారు.  అయినా.. రేషన్‌ కార్డుల్లో పేరున్నవారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నది. ఇలా రేషన్‌ బియ్యం పక్కదారిపట్టకుండా.. బోగస్‌ రేషన్‌ కార్డుల ఏరివేతతోపాటు, సరుకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ‘నో యువర్‌ కస్టమర్‌’ (KYC)పేరుతో రేషన్‌ కార్డుల వేరిఫికేషన్‌ ప్రోగ్రామ్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రేషన్‌ కార్డుల్లో పేరున్నవారంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేసింది.

కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ  

తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం మీ సేవా పోర్టల్ ద్వారా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి చివరిలోపు సమర్పించవచ్చు.  తెలంగాణలో డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు ఇటీవల ముగిసిన ప్రజాపాలన కార్యక్రమంలో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సబ్సిడీ గ్యాస్, ఆర్థిక సహాయం కోసం అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. 500 ధర కలిగిన సబ్సిడీ ఎల్‌పిజి సిలిండర్ల కోసం మొత్తం 91.49 లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకోగా, 92.23 లక్షల మంది మహిళలు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios