Ration Card E-KYC: రేషన్‌కార్డుల ఈ-కేవైసీ లాస్ట్‌డేట్ ఎప్పుడంటే..?
Ration Card E-KYC: రేషన్‌కార్డు (Ration Card) లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్‌డేట్ ఇచ్చింది. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్‌కార్డు కేవైసీ (Ration Card E-KYC)ప్రక్రియను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ రేషన్‌కార్డుల ఈ-కేవైసీ లాస్ట్‌డేట్ ఎప్పుడంటే
Ration Card E-KYC: రేషన్‌కార్డు (Ration Card) లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం అప్‌డేట్ ఇచ్చింది. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్‌కార్డు కేవైసీ (Ration Card E-KYC) ప్రక్రియను తర్వలో ముగించనుంది. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేసేందుకు గడువును పొడిగించింది. తెలంగాణలో రేషన్ కార్డ్ ఇ-కేవైసీ గడువును జనవరి 31, 2024 వరకు పొడిగిస్తూ పౌరసరఫరాల కమిషనర్ దేవేంద్ర సింగ్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో రేషన్ కార్డు ఇ-కెవైసి ప్రక్రియను ఇంకా పూర్తి చేయని వారికి ఈ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుంది.
అయితే.. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు.. అంటే గత తొమ్మిదేండ్లలో ఎంతోమంది చనిపోరు. మరికొందరు కొత్తగా పెండ్లిళ్లు చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయారు. మరికొందరు పెండ్లి తర్వాత వేరుగా ఉంటున్నారు. అయినా.. రేషన్ కార్డుల్లో పేరున్నవారందరికీ ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తున్నది.
ఇలా రేషన్ బియ్యం పక్కదారిపట్టకుండా.. బోగస్ రేషన్ కార్డుల ఏరివేతతోపాటు, సరుకుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ‘నో యువర్ కస్టమర్’ (KYC)పేరుతో రేషన్ కార్డుల వేరిఫికేషన్ ప్రోగ్రామ్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రేషన్ కార్డుల్లో పేరున్నవారంతా వేలిముద్రలు వేయాలని స్పష్టం చేసింది.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 70.80 శాతం ఈ-కేవైసీ పూర్తయింది. ఇందులో 87.81 శాతంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, 54.17 శాతం వనపర్తి జిల్లా చివరి స్థానంలో ఉంది. ఈనేపథ్యంలో కేవైసీకి తుదిగడువు విధిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీచేసింది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు
కాగా..రాష్ట్రంలో కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రజాపాలన ఫారాలతో పాటు నిర్దేశిత కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్త రేషన్ కార్డులకు ప్రత్యేక ఫారం లేదు. సాధారణ కాగితంపై వివరాలను రాసి దరఖాస్తులను సమర్పించవచ్చు. కొత్త రేషన్‌కార్డుల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరమని గతంలో వార్తలు వచ్చాయి. అయితే.. తర్వాత అలాంటి అవసరం లేదని స్పష్టం చేసింది. రేషన్ కార్డులు ఉన్నవారు e-KYC పూర్తి చేయాలి. అయితే కొత్త దరఖాస్తు ఫారమ్‌లను తెలంగాణలోని ప్రజాపాలన కేంద్రాలలో సమర్పించవచ్చు.