హైద‌రాబాద్ః
 4వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని ఈ నెల 21న ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి  తెలంగాణ సర్కార్ విస్తృతంగా ఏర్పాట్లు  చేస్తోంది తెలంగాణ ప్ర‌భుత్వం. వ‌ర‌ుస‌గా నాలుగోసారి గ‌చ్చిబౌలి స్టేడియంలో యోగా డేని నిర్వ‌హించనుంది.


ఈ యోగా దినోత్స‌వానికి ఆయుష్ విభాగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్‌లో గురువారం నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి అధ్యక్ష‌త వ‌హిస్తారు.డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ, కేంద్ర రోడ్లు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారులు, షిప్పింగ్‌, ర‌సాయ‌న‌, ఎరువుల శాఖ‌ల స‌హాయ మంత్రి మాన్‌షుక్ ల‌క్ష్మ‌ణ్ మాంధ‌వ్య, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజ‌రు అవుతున్నారు.

యోగం అంటే సాధన అనీ, అదృష్టమనీ అర్థాలున్నాయి. భారతీయ తత్వ శాస్త్రంలోని ఆరు దర్శనాలలో "యోగ" లేదా "యోగ దర్శనము" ఒకటి. ఈ యోగ దర్శనానికి ప్రామాణికంగా చెప్పబడే పతంజలి యోగసూత్రాల ప్రకారం "యోగం అంటే చిత్త వృత్తి నిరోధం". స్థిరంగా ఉండి సుఖాన్నిచ్చేది ఆసనం. అభ్యాస వైరాగ్యాల వలన చిత్త వృత్తులను నిరోధించడం సాధ్యమవుతుందని చెప్పారు. 


ఈ నెల 21న గ‌చ్చిబౌలి స్టేడియంలో ఉద‌యం 6.30గంట‌ల నుంచి 8 గంట‌ల వ‌ర‌కు జ‌రిగే యోగ కార్య‌క్ర‌మానికి స‌భాధ్య‌క్ష‌త వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి వ‌హి'స్తారు.డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ, విశిష్ట అతిథిగా కేంద్ర రోడ్లు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారులు, షిప్పింగ్‌, ర‌సాయ‌న‌, ఎరువుల శాఖ‌ల స‌హాయ మంత్రి మాన్‌షుక్ ల‌క్ష్మ‌ణ్ మాంధ‌వ్య హాజ‌రు అవుతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా యోగా డేను నిర్వ‌హిస్తున్నారు. 2015 నుంచి ఎంపిక చేసిన 27 గ్రామాల‌తోపాటు ఈ సారి కొత్త‌గా ఏర్ప‌డ్డ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ యోగా డే నిర్వహించనున్నారు.