అధిక ఫీజులు: తెలంగాణలో ఆరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ అనుమతులు రద్దు
: తెలంగాణలోని మరో ఆరు ఆసుపత్రులకు కరోనా ట్రీట్ మెంట్ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరక సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: తెలంగాణలోని మరో ఆరు ఆసుపత్రులకు కరోనా ట్రీట్ మెంట్ అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరక సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్దంగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ ఆసుపత్రులపై ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సరైన సమాధానం ఇవ్వని ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్ మెంట్ అనుమతులను రద్దు చేసింది.
also read:కరోనా చికిత్సకు అధిక ఫీజులు: నిజామాబాద్ లో ఆరు ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు
హైద్రాబాద్ కేపీహెచ్ బీ లోని పద్మజ, అల్వాల్ లోని లైఫ్ లైన్ మెడిక్యూర్, ఉప్పల్ లోని టీఎక్స్, సంగారెడ్డిలో శ్రీసాయిరాం ఆసుపత్రి హన్మకొండలోని మ్యాక్స్ కేర్ , వరంగల్ లోని లలిత ఆసుపత్రుల్లో కరోనా ట్రీట్ మెంట్ అనుమతిని రద్దు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రోగుల నుండి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్రంలోని 105 ఆసుపత్రులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. తాజాగా ఇవాళ మరో 16 ఆసుపత్రులకు నోటీసులిచ్చింది ప్రభుత్వం.ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకొంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.