కరోనా చికిత్సకు అధిక ఫీజులు: నిజామాబాద్ లో ఆరు ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు

కరోనా రోగులకు చికిత్స అందించే పేరుతో  అధిక ఫీజులు వసూలు  చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు వైద్య ఆరోగ్యశాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. 

Telangana Health department issues notice to six private hospitals in Nizambad lns

నిజామాబాద్: కరోనా రోగులకు చికిత్స అందించే పేరుతో  అధిక ఫీజులు వసూలు  చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు వైద్య ఆరోగ్యశాఖాధికారులు నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన ఆసుపత్రులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకొంది. ఇటీవలనే 88 ప్రైవేట్ ఆసుపత్రులకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు నోటీసులు జారీ చేశారు.  తాజాగా నిజమాబాద్ జిల్లాలోని ఆరు ప్రైవేట్ ఆసుపత్రులకు సోమవారం నాడు నోటీసులు ఇచ్చారు. 

రాజేష్ కోవిడ్ సెంటర్, ఇండస్ ఆసుపత్రి, శశాంక్ ఆసుపత్రికి నోటీసులువేదాంష్ ఆసుపత్రి, ఆన్షుల్ ఆసుపత్రి, శ్రీలైఫ్ గాయత్రి ఆసుపత్రులకు వైద్య ఆరోగ్యశాఖాధికారులు సోమవారం నాడు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని  అధికారులు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రులు  కరోనా చికిత్స విషయంలో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకొంటామని వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు హెచ్చరించారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios