Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో 9 మెడికల్‌ కాలేజీల్లో కొత్తగా 313 పోస్టులు.. ఆర్థిక శాఖ ఉత్తర్వులు..

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించేవారికి మరో శుభవార్త. తెలంగాణలో వైద్య విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

telangana government approves new 313 posts in health department
Author
First Published Feb 4, 2023, 3:07 PM IST

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగాలను ఆశించేవారికి మరో శుభవార్త. తెలంగాణలో వైద్య విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలోని 9 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని 313 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది.  క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతులిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లు హెల్త్ సర్వీసెస్ బోర్డ్ ద్వారా జరుగనున్నాయి.

ఇక, ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ), మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా భర్తీ చేయనున్న వివిధ విభాగాల్లో మొత్తం 2,391 పోస్టుల భర్తీకి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని ఆర్థి శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఔత్సాహికులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios