కేసీఆర్ సర్కార్ మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లకు చైర్మన్లుగా మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సాయిచందర్‌లను నియమించారు.
Telangana corporations: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు కార్పొరేషన్లకు చైర్మెన్ లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లకు చైర్మన్లుగా మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సాయిచందర్‌లను నియమించారు.
ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం.. మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్(NMDC) ఛైర్మెన్ గా మన్నే క్రిశాంక్. తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మెన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్, అలాగే తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మెన్ గా సాయి చంద్ నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పదవుల్లో వీరు రెండేండ్ల పాటు కొనసాగుతారని ఉత్తర్వుల్లో తెలిపారు.
