Asianet News TeluguAsianet News Telugu

టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్‌గా జనార్ధన్ రెడ్డి నియామకం: కేసీఆర్ సర్కార్ నిర్ణయం

 టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మెన్‌గా బి. జనార్ధన్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ సర్కార్ శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. 

Telangana Government appoints B. Janardhan Reddy as chairman of TSPSC lns
Author
Hyderabad, First Published May 19, 2021, 10:54 AM IST

హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మెన్‌గా బి. జనార్ధన్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ సర్కార్ శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.టీఎస్‌సీఎస్‌సీ ఛైర్మెన్ గా జనార్ధన్ రెడ్డితో పాటు టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, టీఎన్‌జీవో మాజీ అధ్యక్షుడు రవీందర్ రావు, ఆయుర్వేద డాక్టర్ చంద్రశేఖర్ రావు, రిటైర్డ్ హెల్త్ ఈఎన్‌సీ రమావత్ ధన్ సింగ్, సీబీఐటీ ప్రోఫెసర్ లింగారెడ్డి, డిప్యూటీ కలెక్టర్ కోట్ల అరుణకుమారిలను సభ్యులుగా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. 

&

nbsp;

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్ గా ఘంటా చక్రపాణిని నియమిస్తూ  కేసీఆర్ సర్కార్ గతంలో నిర్ణయం తీసుకొంది. ఘంటా చక్రపాణితో పాటు తెలంగాణ ఉద్యోగ సంఘం నేత సి. విఠల్, ప్రముఖ విద్యావేత్త మతీనుద్దీన్ ఖాద్రీ, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతిలను  నియమించింది. అయితే  2020 డిసెంబర్ 17వ తేదీతో ఘంటా చక్రపాణి పదీకాలం ముగిసింది. ఘంటా చక్రపాణితో పాటు విఠల్, చంద్రావతి, మహ్మద్ ఖాద్రీ పదవీకాలం ముగిసింది. అప్పటి నుండి ఈ పదవి ఖాళీగా ఉంది. ఈ పదవిని భర్తీ చేయడానికి ప్రభుత్వం పలువురి పేర్లను పరిశీలించింది.  గతంలో ఈ పదవి కోసం పలువురు ఐఎఎస్, ఐపీఎస్ ల పేర్లను కూడ ప్రభుత్వం పరిశీలించింది. చివరకు ఐఎఎస్ అధికారి జనార్ధన్ రెడ్డి వైపే తెలంగాణ సర్కార్ మొగ్గు చూపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios