School Holiday : రేపు ఒక్కరోజే స్కూల్స్ నడిచేది ... ఎల్లుండి మరో సెలవు 

తెలంగాణ విద్యార్థులకు సరిగ్గా ఈవారం మధ్యలో మరో సెలవు వస్తోంది. ఎందుకోసమో తెలుసా?  

Telangana government announces a holiday on January 1, 2025 new year AKP

School Holidays : స్కూల్ స్కూడెంట్స్ ఎగిరిగంతేసే సమాచారం. గతవారం క్రిస్మస్ తో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా తెలంగాణలోని స్కూళ్లకు భారీగా సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో విద్యార్థులు క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయి కుటుంబసభ్యులు, స్నేహితులతో హాయిగా ఇంటివద్దే గడిపారు. ఇలా గతవారమంతా సరదాగా గడిపి ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ స్కూల్ అంటే పిల్లలకు బాధగానే వుంటుంది. ఇలా బాధపడుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్... కేవలం ఇవాళ, రేపు (సోమ,మంగళవారం) స్కూల్ కి వెళితే చాలు... బుధవారం మరో సెలవు వస్తోంది.  

తెలంగాణ స్టూడెంట్స్ మరో సెలవు : 

ఈ రెండ్రోజులు గడిస్తే చాలు ప్రస్తుత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరంలో అడుగుపెడతాం. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రేపు (డిసెంబర్ 31, మంగళవారం), ఎల్లుండి (జనవరి 1, 2025బుధవారం) ప్రపంచవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటారు. ఇలా మనదేశంలో కూడా న్యూఇయర్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి.  

ఈ న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. జనవరి 1న రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీలను సెలవు ఇచ్చింది రేవంత్ సర్కార్. ఇలా గతవారమంతా సెలవులతో ఎంజాయ్ చేసిన స్టూడెంట్స్ ఈవారం మధ్యలో మరో సెలవు రావడంతో ఖుషీ అవడం ఖాయం. 

ఇక కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు సాధారణంగానే శని,ఆదివారం రెండ్రోజులు సెలవు వుంటుంది. అలాంటి స్కూల్స్ ఈవారం కేవలం నాలుగురోజులు (సోమ,మంగళ,గురు,శుక్రవారాలు) మాత్రమే నడవనున్నాయి. ఇక సాధారణంగా ఆదివారం సెలవుండే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ వారం ఐదురోజులు (సోమ, మంగళ,గురు, శుక్ర, శనివారం) పనిచేయనున్నాయి. 

ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు : 

తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సరం సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించింది... అంటే జవనరి 1న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సెలవు వుంటుంది. ఆరోజు ప్రభుత్వ కార్యాలయాలు మూసివేసివుంటాయి. 

ఇక పార్టీ కల్చర్ ఎక్కువగా వుండే హైదరాబాద్ వంటి మహానగరాల్లో ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ ను చాలా ఘనంగా చేసుకుంటారు. ఇప్పటికే ప్లాన్స్ రెడీ చేసుకుని వుంటారు. డిసెంబర్ 31న రాత్రంతా పార్టీలో మునిగిపోతారు. కాబట్టి  జనవరి 1న కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా సెలవు ప్రకటిస్తాయి. ఇక మిగతా సంస్థల ప్రైవేట్ ఉద్యోగులు కూడా లీవ్ తో మ్యానేజ్ చేస్తారు. 

న్యూ ఇయర్ ఆరంభం రోజున చాలామంది కుటుంబంతో కలిసి సంబరాలు చేసుకుంటారు. డిసెంబర్ 31 రాత్రి కేక్ కట్ చేయడం, జనవరి 1న గుడికి వెళ్లి పూజలు, చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తుంటారు. ఇక మహిళలు తెల్లవారుజామునే లేచి ఇంటిముందు రంగవళ్లులు వేసి నూతనసంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఇలా ఓ పండగలా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. 

అయితే జనవరి 1న సెలవు ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు బదులుగా ఫిబ్రవరి 8న పనిదినంగా ప్రకటించింది. అంటే ఫిబ్రవరిలో రెండో శనివారం రోజున సెలవు వుండదన్నమాట... ఆరోజు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేస్తాయి.

 ఆంధ్ర ప్రదేశ్ లో న్యూ ఇయర్ సెలవు?: 

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు షాక్ ఇచ్చింది. తెలంగాణలో మాదిరిగా ఏపీలో కూడా ఈ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సెలవు వుంటుందని భావించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం విద్యాసంస్థలకు గాని,ప్రభుత్వ ఉద్యోగులకు గానీ సెలవు ఇవ్వడంలేదు. అయితే జనవరి 1 ఐచ్చిక సెలవు మాత్రం ప్రకటించింది. 

ఇప్పటికే వర్షాలు, వరదలు కారణంగా ఏపీలోని విద్యాసంస్థలకు భారీగా సెలవులు వచ్చాయి. ఇక ఈ జనవరిలోని మరో పదిరోజులు సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి. ఇలా సెలవుల కారణంగా పిల్లల చదువు దెబ్బతింటోందని అటు తల్లిదండ్రులు, ఇటు ప్రభుత్వం కంగారుపడుతోంది. అందువల్లే పరీక్షలు ముగిసేవరకు వీలైనంత తక్కువగా సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.  అందుకోసమే జనవరి 1న సెలవు ఇవ్వలేదు. 

ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై కొందరు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తుండగా... మరికొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ స్కూల్ పిల్లలు మాత్రం న్యూ ఇయర్ సెలవు వస్తుందని ఆశించి నిరాశ పడ్డారు. కానీ మరో పదిరోజుల్లో సంక్రాంతి సెలవులు వస్తున్నాయని సర్దిచెప్పుకుంటున్నారు. ఇలా ఈ న్యూ ఇయర్ సెలవులపై రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కోలా నిర్ణయం తీసుకున్నాయి. 

ఇవి కూడా చదవండి :

2025 లో బ్యాంకులకు సెలవులే సెలవులు
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios