మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. డిసెంబర్ 31న అర్దరాత్రి వరకు మద్యం విక్రయాలు..
తెలంగాణలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31న అర్దరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతించింది.

తెలంగాణలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31న అర్దరాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతించింది. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం.. 2022 డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు రిటైల్ మద్యం దుకాణాలను తెరిచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతిని మంజూరు చేసింది. బార్లు, మద్యం అందించే ఇతర రెస్టారెంట్లు తెల్లవారుజామున 1 గంటల వరకు తెరిచి ఉంచవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని రకాల కోవిడ్ సెఫ్టీ ప్రోటోకాల్సి పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.