వరంగల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్... 50ఎకరాలు కేటాయించిన కేసీఆర్ సర్కార్
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు వరంగల్ జిల్లాలో 50 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేసీఆర్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్... ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి నేటి తెలంగాణ రాష్ట్రం వరకు విద్యారంగంలో సేవలందిస్తున్న అత్యుత్తమ విద్యాసంస్థ. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్ విద్యార్ధులకు మాత్రమే విద్యాబుద్దులు నేర్పిన ఈ సంస్థ ఐదేళ్లక్రితం వరంగల్లో అడుగుపెట్టింది. అయితే అద్దె భవనంలో విద్యాసంస్థను కొనసాగిండం ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వ సహకారం కోరగా సీఎం కేసీఆర్ వెంటనే స్పందించారు. వరంగల్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కి టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే స్థలాన్ని కేటాయించింది.
ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్ వరకు విద్యనందించడమే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, చారిత్రక నేపథ్యం కలిగి విద్యాసంస్థ HPS. అయితే తమ విద్యాసంస్ధ కార్యాకలాపాలకు అనువుగా స్థలం కేటాయించాలని hyderabad public school society ప్రభుత్వాన్ని కోరింది. దీంతో హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామంలోని 50 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మార్కెట్ రేటుకే ఈ విద్యాసంస్థకు కేటాయిస్తూ జీవో నెంబర్ 93ని జారీ చేసింది కేసీఆర్ సర్కార్. ఈ జీవోని ప్రభుత్వం తరపున రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి errabelli dayakar rao హెచ్పిఎస్ సొసైటీ సభ్యులకు అందించారు.
హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో సోమవారం మంత్రి ఎర్రబెల్లిని రాజ్యసభ సభ్యుల సురేశ్‌రెడ్డితో కలిసి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ వైస్ చైర్మన్, ఉపాధ్యక్షుడు గుస్తీ జె. నోరియా కలిసారు. ఈ క్రమంలోనే భూమి కేటాయింపుకు సంబంధించిన జీవో ప్రతిని వారికి అందించారు మంత్రి.
ఈ సందర్భంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరంగల్ కి రావడానికి సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, CM KCR కి, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుకు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, హన్మకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతులకు హెచ్పిఎస్ సొసైటీ ఉపాధ్యక్షుడు నోరియా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
READ MORE నేడు టీఆర్ఎస్ లో చేరనున్న మోత్కుపల్లి.. డబుల్ ధమాకాతో సర్ ప్రైజ్...
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... 1923లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బేగంపేటలో 122 ఎకరాలలో ఇండో సారాసెనిక్ పద్ధతిలో నిర్మించిన విశాలమైన భవనాలలో జాగిర్దార్ కాలేజీగా ప్రారంభించారని గుర్తుచేసారు. ఆనాడు నవాబులు, జాగిర్దార్‌లు, ఉన్నత వర్గాల పిల్లలకు విద్యనందించేందుకు ఈ కాలేజీ పని చేసిందన్నారు. నిజాం శకం ముగిసిన తర్వాత 1951లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గాపేరు మార్చి సొసైటీ గవర్నింగ్ బాడీ ఆధ్వర్యంలో పని చేస్తున్నదన్నారు.
హైదరాబాద్ లోని బేగంపేట, రామాంతపూర్, కడప తర్వాత వరంగల్ లోని మరో బ్రాంచీ నడుస్తుందన్నారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యం కలిగిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మన చారిత్రక వరంగల్ కేంద్రానికి 5 ఏళ్ళ క్రితమే రావడం... దానికి ఈ రోజు స్థలాన్ని కేటాయించడం అత్యంత సంతోషించదగ్గ విషయం అన్నారు మంత్రి ఎర్రబెల్లి.
ఎపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మైక్రోసాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ళ, ప్రఖ్యాత క్రికెట్ విశ్లేషకులు హర్షా భోగ్లే, విప్రో సిఇఓ కురియన్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, హీరోలు నాగార్జున, రామ్ చరణ్, రాణా, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు వంటి అనేక మంది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లోనే చదివారని మంత్రి వివరించారు. వరంగల్ లోనూ త్వరలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభమై మంచి విద్యాబుద్ధులు ఈ ప్రాంత విద్యార్థులకు కూడా అందించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు మంత్రి ఎర్రబెల్లి.