విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ జెన్‌కో రికార్డు సృష్టించింది. గత మూడేళ్లలో ఉత్పత్తి చేసిన విద్యుత్ కంటే ఈ ేడాది విద్యుత్ ఉత్పత్తి అధికమని జెన్ కో అధికారులు ప్రకటించారు.
హైదరాబాద్: Telangana Genco విద్యుత్ ఉత్పత్తిలో రికార్డు నెలకొల్పింది. 2021-22 లో 30,447 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసింది. గత మూడేళ్లలో ఉత్పత్తి చేసిన Electricity ఉత్పత్తిలో ఇదే రికార్డుగా అధికారులు చెబుతున్నారు. 2020-21 లో థర్మల్ విద్యుత్ కేంద్రాల ఉత్పాదక సామర్ధ్యం73.82 శాతం గా ఉంది.2020-21 లో 70.64 శాతం, 2019-20 ay 71.86 శాతం పీఎల్ఎఫ్ నమోదయ్యాయి.
అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని డిమాండ్ కంటే అధిక డిమాండ్ రాష్ట్రంలో ఉంది. అయితే ఎంత డిమాండ్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ ను సరఫరా చేస్తున్నాయి తెలంగాణ విద్యుత్ సంస్థలు.
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. రాష్ట్రంలో మార్చి 26న 13,742 మెగావాట్ల పీక్ డిమాండ్ నమోదైనట్లు Transco, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఇదే పీక్ విద్యుత్ డిమాండ్‌గా తెలిపారు. మార్చి 27న 14 వేల మెగావాట్ల డిమాండ్ ను కూడా దాటింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోనూ విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని విద్యుత్ శాఖాధికారులు గుర్తించారు. గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్ 55 మిలియన్ యూనిట్లు దాటలేదు. కానీ ఈ ఏడాది మార్చిలోనే 65 మిలియన్ యూనిట్స్ డిమాండ్ ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది. నిత్యం కరెంటు కోతలు, పవర్ హాలిడేలు విధించేవారు. హైదరాబాద్ నగరంలో రోజూ 2 నుంచి 4 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 12 గంటలు విద్యుత్ కోతలు అమలయ్యేవి. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలుండేవి.
వ్యవసాయానికి రెండు, మూడు గంటల కరెంటు కూడా అందకపోవడంతో పంటలు ఎండిపోయేవి. భూగర్భంలో నీళ్లున్నా తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంట కళ్లెదుటే నాశనం అయ్యేది. లో ఓల్టేజీ సమస్యల వల్ల నిత్యం మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి.
తెలంగాణకు చెందిన విద్యుత్ సంస్థల్లో సంస్థాగత సామర్థ్యాన్ని పెంచారు. స. నత్తనడకన నడుస్తున్న భూపాలపల్లి, జూరాల, పులిచింతల, జైపూర్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణాలను పరుగులు పెట్టించారు. తెలంగాణలో పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ అత్యవసరం కాబట్టి ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఎక్కడ కరెంటు అందుబాటులో ఉంటే అక్కడ నుంచి తీసుకున్నారు. ఉత్తరాది నుంచి కరెంటు పొందడానికి వీలుగా ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుని పిజిసిఎల్ ద్వారా కొత్త లైను నిర్మాణం చేయించారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రూపకల్పన చేశారు. విద్యుత్ సంస్థలు సింగరేణికి బకాయిపడిన 5,772 కోట్ల రూపాయలను ప్రభుత్వమే చెల్లించింది
మొత్తంగా ప్రభుత్వం ఏర్పడిన ఏడేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 42,632 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించింది.
తెలంగాణ విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహం అనుసరించింది. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో పకడ్బందీ వ్యూహం రూపొందించింది.రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరో నెల నుంచే కోతల్లేని విద్యుత్ ప్రజలకు అందిస్తున్నారు.
