Telangana Formation Day: రాజ‌కీయ మైలేజీ కోస‌మే కాంగ్రెస్-బీజేపీల ఆరాటం.. : మంత్రి జగదీశ్‌రెడ్డి

Telangana Formation Day: ఆరు దశాబ్దాలకు పైగా సాగిన రాష్ట్ర సాధన పోరాటంలో చేసిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ నేడు తెలంగాణ రాష్ట్రం అవ‌త‌ర‌ణ దినోత్స‌వాల‌ను జ‌రుపుకుంటోంది. రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు పోటాపోటీగా రాష్ట్ర వ‌త‌ర‌ణ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్, బీజేపీల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

Telangana Formation Day: Congress-BJP's quest for political mileage : Minister Jagadish Reddy

Energy Minister G Jagadish Reddy: ఆరు దశాబ్దాలకు పైగా సాగిన రాష్ట్ర సాధన పోరాటంలో చేసిన  పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ నేడు తెలంగాణ రాష్ట్రం అవ‌త‌ర‌ణ దినోత్స‌వాల‌ను జ‌రుపుకుంటోంది. రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు పోటాపోటీగా రాష్ట్ర వ‌త‌ర‌ణ వేడుక‌ల‌ను నిర్వ‌హిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్, బీజేపీల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని కాంగ్రెస్, బీజేపీలు నిర్ణయించడం కూడా వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం రెండు జాతీయ పార్టీల డ్రామా అని విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తన క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా రెండు పార్టీలు పనిచేస్తున్నాయనీ, ఈ విషయంలో అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఈ రెండు జాతీయ పార్టీల నేతలు టీఆర్ ఎస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారనీ, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రతిష్టను దెబ్బతీసేందుకు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిప‌డ్డారు.

దేశాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమైన బీజేపీకి, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైన కాంగ్రెస్ కు విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే నైతిక హక్కు లేదని ఆయన  అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తెలంగాణ ఉద్యమకారుల విజయమన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకునే నైతిక హక్కు ఈ రెండు రాజకీయ పార్టీలకు లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే, ఎంపి రాజీనామా చేయాలని టిఆర్ఎస్ పిలుపునివ్వడంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు వెనక్కి తగ్గారని విమ‌ర్శించారు. 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని చాటిచెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా సంక్షేమంలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అనంతరం సద్దాల చెరువులో బోటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించేందుకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios