Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అటవీ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్

  • అటవీ ఉద్యోగులు పనిచేసే చోటే నివశించాలి
  • లేకపోతే కఠినచర్యలు తప్పవని హెచ్చరిక
  • హరితహారంపై సీరియస్ గా పనిచేయాలి
  •  
telangana forest staff must live in working place

అటవీ ఉద్యోగులకు ఇది కొద్దిగా షాక్ కలిగించే వార్త. పనిచేసే చోటే అటవీ ఉద్యోగులు నివశించాలని సిఎం కేసిఆర్ ఆదేశాలిచ్చినట్లు అటవీశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. సచివాలయం నుంచి అటవీశాఖ సిబ్బందితో ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులోని అంశాలివి. అటవీ భూముల రక్షణకు భూ రికార్డుల ప్రక్షాళనను మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలి. అటవీ సంపద, పచ్చదనం పరిరక్షణ ధ్యేయంగా పనిచేయాలి. మంచి వర్షాలను సద్వినియోగం చేసుకుని హరితహారం పూర్తి చేయాలి. అన్ని పట్టణ ప్రాంతాల్లో అర్బన్ పార్క్ ల ఏర్పాటుకు సీ.ఎం ఆదేశాలు. పనిచేసే ప్రాంతాల్లోనే అటవీ సిబ్బంది తప్పనిసరిగా నివసించాలి, లేదంటే కఠిన చర్యలు తప్పవు.

ఇప్పటిదాకా జరిగిన ప్లాంటేషన్, తీసుకున్న రక్షణ చర్యలపై జిల్లాల వారీగా సమీక్షించారు. జిల్లాల వారీగా హరితహారం కార్యాచరణ, అమలు తీరు, సమస్యలు, నర్సరీల పరిస్థితి, ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పై సమావేశంలో చర్చించారు. మంచి వర్షాలు కురుస్తున్నందున సద్వినియోగం చేసుకుని ప్లాంటేషన్ టార్గెట్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ యేడాది హరితహారం టార్గెట్ మొత్తం నలభై కోట్లు కాగా.. ఇప్పటికే 27 కోట్ల మొక్కలు నాటి 67 శాతం టార్గెట్ ను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఖమ్మం, వరంగల్ రూరల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, కామారెడ్డి జిల్లాలు ఇప్పటికే ఎనభై శాతానికి పైగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశాయి. మిగతా జిల్లాలు కూడా ఇదే స్ఫూర్తితో, పూర్తి రక్షణ చర్యలతో హరితహారాన్ని కొనసాగించాలని అధికారులు కోరారు.

వర్షపాతం తక్కువ ఉన్న జిల్లాల్లో పరిస్థితిని అంచనా వేసుకుని మొక్కలు నాటాలని ఉన్నతాధికారులు తెలిపారు. హార్టీ కల్చర్ శాఖ పండ్ల మొక్కలను ఇచ్చేందకు సిద్దంగా ఉన్నందున, అవసరం మేరకు పంపిణీ చేసే ప్రజలతో పండ్ల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం, ఆ మేరకు నాటిన మొక్కల వివరాలపై త్వరలోనే అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సమీక్షిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనను, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని, అటవీ భూముల గుర్తింపుకు, వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రధాన అటవీ సంరక్షణ అధికారి పీ.కె. ఝా కోరారు. అటవీ సంపద రక్షణ కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పట్టుదలగా ఉన్నారని, భూ సర్వే కోసం కలెక్టర్లతో నిర్వహించిన సమాేవేశంలో ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు.

అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తప్పని సరిగా పనిచేసే చోటే నివాసం ఉండాలని, లేదంటే తదుపరి క్రమశిక్షణా చర్యలకు సిద్దంగా ఉండాలని, ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ ఉండవని హెచ్చరించారు. ఈ విషయంలో కఠినంగా ఉండాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. అన్ని పట్టణ ప్రాంతాల వెంట ఉన్న అటవీ బ్లాక్ ల్లో అర్బన్ పార్క్ ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆదేశించారని, ప్రతీ జిల్లాల్లో వీటిని గుర్తించి, అభివృద్ది ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. ఇక ఇప్పటికే జిల్లాల వారీగా నిర్దేశించిన లక్ష్యాల మేరకు రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ ను పూర్తి చేయాలని సూచించారు. GST అమలుతో అటవీశాఖపై పడుతున్న ప్రభావంపై కమర్షియల్ టాక్స్ ఉన్నతాధికారితో ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనుమానాలను నివృత్తి చేసి శాఖ తరుపున తప్పని సరిగా జీ ఎస్టీ అమలు చేయాలని ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios