తెలంగాణలో (Telangana) తొలి స్వలింగ సంపర్కుల వివాహం జరిగింది. ఇద్దరు పురుషులు (Gay marriage).. కుటుంబ సభ్యులను ఒప్పించి వారి సమక్షంలో ఈ వేడుక జరపుకున్నారు. 8 ఏళ్ల క్రితం ప్లానెట్ రోమియో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై వీరిద్దరు.. ఇలా ఒక్కటయ్యారు.
ఇద్దరు మగవాళ్లు పెళ్లి చేసుకున్నా.. ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకున్నా.. విదేశాల్లో ఇలాంటి వాటిని అసలు పట్టించుకోరు. కానీ భారత్‌లో మాత్రం ఇలాంటి వివాహలను ఆమోదించరనే చెప్పాలి. దేశంలో స్వలింగ వివాహాలను చట్టం గుర్తించదు. ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇటువంటి పెళ్లిలు పెద్దల సమక్షంలో జరిగిన దాఖలాలు లేవు. కానీ తాజాగా తెలంగాణలో (Telangana) తొలి స్వలింగ సంపర్కుల వివాహం గ్రాండ్‌గా జరిగింది. ఇద్దరు పురుషులు (Gay marriage).. కుటుంబ సభ్యులను ఒప్పించి వారి సమక్షంలో ఒక్కటయ్యారు. వివరాలు.. సుప్రియో ఓ హోటల్ మేనేజ్‌మెంట్ స్కూల్లో లెక్చరర్‌గా పనిచేస్తుండగా.. అభయ్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరు హైదరాబాద్‌లో సెటిలయ్యారు. వీరిద్దరికి 8 ఏళ్ల క్రితం ప్లానెట్ రోమియో డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది.
తర్వాత ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఒకరి గురించి ఒకరు తెలుసుకుని మరింతగా దగ్గరయ్యారు. కొంతకాలం సహజీనం కూడా చేశారు. ఈ క్రమంలోనే పెళ్లికి పెద్దలను ఒప్పించడానికి చాలానే కష్టపడ్డారు. చివరకు తాము పెళ్లి చేసుకోబోతున్నట్టుగా ఈ ఏడాది అక్టోబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జంట పెళ్లికి సంబంధించి వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను ప్రముఖ నటి సమంత సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్తా మరింత వైరల్ అయింది.
ఇక, పెళ్లి గురించి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డామని.. దేవుడి దయతో చివరికి వారు ఒప్పుకున్నట్లు సుప్రియో, అభయ్ మీడియాతో చెప్పుకొచ్చారు. ‘మా తల్లిదండ్రులు మొదట్లో పెద్దగా మద్దతు ఇవ్వలేదు. అయినప్పటికీ.. వారు దానిని తిరస్కరించలేదు. వారు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సమయం ఇచ్చారు. ఇప్పుడు మేము వారి అంగీకారం పొందాము’ అని సుప్రియో అన్నారు.
భారతీయ చట్టం స్వలింగ వివాహాలను గుర్తించనప్పటికీ.. 'ప్రామిసింగ్ వేడుక'తో తమ రిలేషన్‌ను అధికారికంగా జరుపుకోవాలని వారిద్దరు నిర్ణయించుకున్నారు. ఈ వేడుకును వారి హైదరాబాద్‌కు చెందిన స్నేహితురాలు సోఫియా డేవిడ్ నిర్వహించింది. ఆమె కూడా ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీకి చెందినవారే. ఈ వేడుకకు కుటుంబం, స్నేహితుల, LGBTQ కమ్యూనిటీకి చెందిన సభ్యులు.. ఇలా మొత్తం 60 మంది పాల్గొన్నారు. ఈ జంట తమను తాము సోల్మేట్స్‌గా పేర్కొంది.
