హైదరాబాద్: తెలంగాణలో బాణసంచాను నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ క్రాకర్స్ అసోసియేషన్ శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

also read:బాణసంచా బ్యాన్: తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

 

రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా నమోదౌతున్న నేపథ్యంలో  బాణసంచాపై నిషేధం విధించాలని తెలంగాణ హైకోర్టు ఈ నెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో బాణసంచాపై నిషేధాన్ని విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ క్రాకర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.ఇవాళ ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టు విచారణ చేయనుంది.రాష్ట్రంలో బాణసంచాను నిషేధించాలని హైకోర్టు ఆదేశాలతో ఇవాళ ఉత్తర్వులను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది.

ఇప్పటికే పలువురు వ్యాపారులు దీపావళిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున క్రాకర్స్ విక్రయం కోసం ఏర్పాట్లు చేసుకొన్నారు.ఈ సమయంలో క్రాకర్స్ పై నిషేధం విధించడంతో తాము నష్టపోతామని క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.