తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు కరోనా వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే. ఆయన ఈస్వయంగా ఈ విషయాన్నీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. తాజాగా హరీష్ రావు ఈ మహమ్మారిని జయించారు. ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని వచ్చినట్టు తెలియవస్తుంది. 

హరీష్ రావుకి కరోనా సోకిందన్న విషయం తెలియగానే ఆయన అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నాయకులూ ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మంత్రి కేటీఆర్ కూడా గెట్ వెల్ సూన్ బావా అంటూ ట్వీట్ చేసారు. 

హరీష్ రావు కి కరోనా నెగటివ్ అని తేలడంతో.... ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కరోనా వైరస్ బారినపడ్డనాటి నుండి హోమ్ ఐసొలేషన్ లోనే ఉంటూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. డాక్టర్ల సలహాలు, సూచనలను క్రమం తప్పకుండా పాటించిన హరీష్ రావు.... ఈ మహమ్మారిని జయించారు.