Asianet News TeluguAsianet News Telugu

పేదల వ్యతిరేక బడ్జెట్: కేంద్ర బడ్జెట్ 2023పై తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు


కేంద్ర ప్రభుత్వం  ప్రవేశపెట్టిన  బడ్జెట్ లో తెలంగాణకు మెండించేయి  తప్ప ఏమీ లేదని  రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  చెప్పారు.  

Telangana Finance Minister  Harish Rao  Reacts  On  union Budget  2023
Author
First Published Feb 1, 2023, 7:26 PM IST


హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రైతు, పేదల వ్యతిరేక బడ్జెట్‌ అని  తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  చెప్పారు.బుధవారం నాడు సాయంత్రం హైద్రాబాద్ లో  కేంద్ర బడ్జెట్  2023పై  హరీష్ రావు  స్పందించారు.   అందమైన మాటలు తప్ప. నిధుల కేటాయింపులో డొల్ల మాత్రమే ఉందన్నారు.   దేశ రైతాంగాన్ని, అభివద్ధి చెందుతున్న రాష్ట్రాలను నిరుత్సాహపరిచే విధంగా  బడ్జెట్‌. ఉందని హరీష్ రావు  చెప్పారు.  ఈ బడ్జెట్ లో   తెలంగాణ రాష్ట్రానికి మరోసారి తీవ్ర అన్యాయం చేశారని ఆయన విమర్శించారు.  తొమ్మిదేళ్లుగా  తెలంగాణ అడుగుతున్న రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ గురించి  ఒక్క మాట కూడా  బడ్జెట్ లో  పేర్కొనలేదన్నారు.  గిరిజన యూనివర్సిటీకి ఇచ్చిన నిధులు తూతూ మంత్రమేనని ఆయన చెప్పారు. విభజన హామీల్లో  ఏ ఒక్కటి అమలు చేయలేదని హరీష్ రావు  విమర్శించారు.  

రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా   జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వలేదన్నారు.. రాష్ట్రంలోని నేతన్నలకు సంబంధించి జీఎస్టీ రాయితీలు కానీ, వారికి ప్రత్యేక ప్రోత్సాహాలు ఇవ్వని విషయాన్ని  మంత్రి గుర్తు  చేశారు.   కొత్త రాష్ట్రానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని అనేకసార్లు కోరినా కూడా  కేంద్రం నుండి స్పందన లేదన్నారు. 

బడ్జెట్‌లో రైతులకు సంబంధించిన నిధుల్లో భారీగా కోత పెట్టాదన్నారు. ఎరువుల సబ్సిడీలు , గ్రామీణ ఉపాధి హామి నిధుల్లో కోత పెట్టారని మంత్రి హరీష్ రావు  చెప్పారు.ఆహార సబ్సిడీలు తగ్గించారన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయలేదని  చెప్పారు . ఉద్యోగులకు, సింగరేణి కార్మికులకు ఇచ్చిన పన్ను మినహాయింపులు కూడా ఆశాజనకంగా ఏమీ లేవన్నారు.  . 

 ఉపాధి హామి పథకానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధుల కోత విధించిందని ఆయన  చెప్పారు. . గత బడ్జెట్ లో 89,400 కోట్లు కేటాయించగా, ఈసారి బడ్జెట్ లో 60వేల కోట్లకు కుదించినట్టుగా  మంత్రి తెలిపారు.  రూ. 29,400 కోట్లు తగ్గించిందన్నారు.. దేశంలో వివిధ రాష్ట్రాలకు కేంద్రం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేసిందన్నారు.  కానీ  తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆయన  చెప్పారు.  తెలంగాణకు వెనుకబడ్డ ప్రాంతాల నిధిగా మూడేళ్ల నుంచి హక్కుగా రావాల్సిన రూ. 1350 కోట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపిందని  ఆయన విమర్శించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios