నిజామాబాద్: రాత్రికి రాత్రే ఓ రైతు కోటిశ్వరుడయ్యాడు.దుబాయ్ లాటరీ రూపంలో నిజామాబాద్ రైతును అదృష్టం వరించింది.ఏకంగా రూ. 30 కోట్లు లాటరీ తగిలింది నిజామాబాద్ రైతు విలాస్.

నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన విలాస్ రిక్కల అనే వ్యక్తికి దుబాయ్ లాటరీ తగిలింది. ఈ లాటరీలో ఏకంగా 4.88 మిలియన్ డాలర్లను గెలుచుకొన్నాడు.45 రోజుల క్రితం విలాస్ ఉపాధి కోసం భార్యతో కలిసి దుబాయ్ కు వెళ్లాడు. అయితే అక్కడ  పని దొరకకపోవడంతో  విలాస్ భార్యతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చాడు.

అయితే స్వదేశానికి వచ్చే సమయంలో  విలాస్ తన పేరున లాటరీ కొనాలని మిత్రుడు రవికి డబ్బులు ఇచ్చి వచ్చాడు.  ఆ డబ్బుతో రవి విలాస్ పేరు మీద లాటరీ కొనుగోలు చేశాడు. 

విలాస్ పేరున రవి కొనుగోలు చేసిన లాటరీకి ఏకంగా రూ. 30 కోట్లు వచ్చాయి. శనివారం నాడు లాటరీ నిర్వాహకులు విలాస్ కు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్తే ఉపాధి దొరకలేదన్నారు. కానీ, తన భార్య ఇచ్చిన డబ్బులతో లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేసినట్టుగా విలాస్ చెప్పారు.ఈ లాటరీ దక్కడానికి తన భార్య పద్మే కారణమని విలాస్ చెబుతున్నారు.