Asianet News TeluguAsianet News Telugu

జూన్ 30 వరకు తెలంగాణలో లాక్‌డౌన్, అంతరాష్ట్ర రవాణాపై నిషేధం ఎత్తివేత

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

telangana extends lock down till june 30
Author
Hyderabad, First Published May 31, 2020, 4:43 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

కంటైన్మెంట్ జోన్లకే జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ వర్తించనుంది. మిగిలిన ప్రాంతాల్లో లాక్ డౌన్ వర్తించదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 8వ తేదీ నుండి కేంద్రం ఏయే రంగాలపై ఆంక్షలను సడలిస్తోందో వాటిపై రాష్ట్రంలో కూడ ఆంక్షలను సడలించనుంది.

అంతరాష్ట్ర రవాణాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకొంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. దీంతో ఈ రాష్ట్రాల నుండి రాకపోకలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంది.

కేంద్ర ప్రభుత్వం అంతరాష్ట్ర రవాణాపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడ రవాణాపై నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకొంది.  రాత్రి 9 గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూను విధించింది. జూలై మాసంలోనే విద్యా సంస్థల తెరిచే విషయమై నిర్ణయం తీసుకోనుంది రాష్ట్రం.

Follow Us:
Download App:
  • android
  • ios