Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. 

Telangana engineering counselling 2023 schedule announce Check Registration Dates ksm
Author
First Published May 27, 2023, 4:11 PM IST

తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ఇటీవల తెలంగాణ  ఎంసెట్ -2023 ఫలితాలను విడుదల చేయగా.. తాజాగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. జూన్ 26 నుంచి మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రారంభంకానుంది. మొదటి విడతలో భాగంగా.. జూన్ 26న ఆన్ లైన్‌లో కౌన్సిలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. 

జూన్ 28 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. జూన్ 28 నుంచి జూలై 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. జూలై 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఉండనుంది. 

రెండో విడత ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ జూలై 21 నుంచి ప్రారంభంకానుంది. జూలై 21 నుంచి 24 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 28 రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఇక, రెండో విడత ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 7 ఇంజనీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఇక, ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios