Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

  • తెలంగాణ వైద్యశాఖలో భారీగా ఖాళీ పోస్టులు
  • భర్తీకి ఆదేశించిన ప్రభుత్వం
telangana employment news

తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్‌లో 3943 పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం జీవో  నెంబ‌ర్ 179 ని జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్‌లోని వివిధ హాస్పిట‌ల్స్‌లో ఆయా పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. వివిధ కేట‌గిరీల్లో పోస్టుల వివ‌రాల‌ను కూడా జీవోలో ప్ర‌క‌టించారు. 

వివిధ కేటగిరీల్లో పోస్టుల వివ‌రాలు ఇలా ఉన్నాయి

   సివిల్ స‌ర్జ‌న్‌/సివిల్ స‌ర్జ‌న్ ఆర్ఎంఓ -483


డిప్యూటీ సివిల్ స‌ర్జ‌న్ -685


సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ -1191


డెంట‌ల్ సివిల్ స‌ర్జ‌న్ -12


డిప్యూటీ డెంట‌ల్ స‌ర్జ‌న్ -16
డెంట‌ల్‌ అసిస్టెంట్ స‌ర్జ‌న్ -10


ఇత‌ర సిబ్బంది

అసిస్టెంట్ డైరెక్ట‌ర్  (అడ్మిన్‌) ఎల్‌.ఎస్‌. గ్రేడ్‌-1 -02


అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ /ఎల‌్‌.ఎస్‌. గ్రేడ్‌-2 -16


సూప‌రింటెండెంట్ /సెక్ష‌న్ ఆఫీస‌ర్ -32


సీనియ‌ర్ అసిస్టెంట్ -30


జూనియ‌ర్ అసిస్టెంట్ -56


ఫార్మ‌సీ సూప‌ర్ వైజ‌ర్ -01


ఫార్మ‌సిస్ట్ గ్రేడ్‌-1 06


ఫార్మ‌సిస్ట్ గ్రేడ్‌-2 -52


ల్యాబ్ టెక్నీషియ‌న్ -152


హెల్త్ ఇన్‌స్పెక్ట‌ర్ -09


చీఫ్ రేడియోగ్రాఫ‌ర్ - 07


రేడియోగ్రాఫ‌ర్ -33


డార్క్ రూమ్ అసిస్టెంట్ -36


ఫిజియోథెర‌పిస్ట్ -45


రిఫ్రాక్ష‌నిస్ట్ -34


జూనియ‌ర్ అన‌లిస్ట్ -44


ఆప్తాల‌మిస్ట్ అసిస్టెంట్ -22


ఆడియోమెట్రీ టెక్నీషియ‌న్ -01


న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్ గ్రేడ్‌-1 -28


న‌ర్సింగ్ సూప‌రింటెండెంట్ గ్రేడ్‌-2 -38


హెడ్ న‌ర్స్‌-162

స్టాఫ్ న‌ర్స్ -565

మిడ్‌వైవ్స్ -126


ఎఎన్ఎం/ఎంపిహెచ్ఎ (ఎఫ్‌) 49

 

సీఎం కెసిఆర్  ఆదేశాలతో ఈ పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేస్తామ‌ని వైద్య ఆరోగ్య మ‌రియు కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి తెలిపారు. అడిగిందే త‌డ‌వు వైద్య స‌మ‌స్య‌లు తెలిసి పోస్టుల మంజూరికి ఆదేశించిన‌ సీఎంకి మంత్రి ల‌క్ష్మారెడ్డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల్లో ఆధునిక వ‌స‌తులు పెంచ‌డం, కొత్త‌గా హాస్పిట‌ల్స్ ని నిర్మించ‌డం, ఉన్న వైద్య‌శాల‌ల‌ను అప్‌గ్రేడ్ చేయ‌డం, కెసిఆర్ కిట్ల ప‌థ‌కం వంటి అనేక స్టెప్స్ తీసుకోవడం వ‌ల్ల ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల‌కు పేషంట్ల రాక పెరిగింద‌న్నారు. దీంతో ఇప్ప‌టిదాక కొంత మేర‌కు ఉన్న కొర‌త తాజాగా చేప‌ట్టే నియామ‌కాల‌తో తీరుతుంద‌న్నారు. భారీ ఎత్తున‌ డాక్ట‌ర్లు, సిబ్బంది వ‌స్తార‌న్నారు. ఒక్క తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్‌తోనే 3943 పోస్టులు వ‌స్తున్నాయ‌న్నారు. ఇవేగాక మిగ‌తా విభాగాల్లోనూ అనేక పోస్టులు వ‌చ్చిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఈ నియామ‌కాలు ప్ర‌భుత్వ వైద్య‌శాల‌ల‌కు వ‌చ్చే రోగుల‌కు మెరుగైన‌, నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందించ‌డానికి వీలవుతుంద‌న్నారు. 

హ‌ర్షం వ్య‌క్తం చేసిన వివిధ వైద్య సంఘాలు

మ‌రోవైపు తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్‌లో 3943 పోస్టులు రావ‌డం ప‌ట్ల వివిధ వైద్య సంఘాలు హ‌ర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్ర‌భుత్వ వైద్యుల సంఘం అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ప్ర‌వీణ్ ప‌ల్లం, ఉపాధ్య‌క్షుడు డాక్ట‌ర్ న‌ర‌హ‌రి, కోశాధికారి డాక్ట‌ర్ లాలు సంతోషం వ్య‌క్తం చేశారు. వైద్య రంగ స‌మ‌స్య‌లే కాక‌, వైద్యులు, సిబ్బంది స‌మ‌స్య‌లు తెలిసిన సీఎం కెసిఆర్‌, వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ రాజేశ్వ‌ర్ తివారీ, క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ పోస్టుల నియామ‌కాలు పూర్త‌యితే ఒక‌వైపు వైద్యులు, సిబ్బంది కొర‌త తీర‌డ‌మేగాక‌, మ‌రోవైపు రోగుల‌కు మంచి వైద్యం అందించ‌డానికి వీల‌వుతుంద‌న్నారు. వైద్యులు, సిబ్బంది మీద భారం త‌గ్గుతుంద‌న్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios