Asianet News TeluguAsianet News Telugu

మిడ్‌మానేర్‌ ఆక్వా హబ్‌ తో 10 వేల మందికి ఉపాధి: కేటీఆర్

Mid Manair Dam: మిడ్‌మానేర్‌లోని ఆక్వా హబ్‌తో 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ  ప్రాజెక్ట్‌లో ఆనంద గ్రూప్, ఫ్రెష్ హోమ్, యూఎస్ ఆధారిత సీపీ ఆక్వా గ్రూప్ పెట్టుబడి పెట్టనున్నాయి.
 

Telangana : Employment for 10 thousand people with Midmanare Aqua Hub: KTR
Author
Hyderabad, First Published Aug 16, 2022, 5:01 PM IST

Telangana minister KTR: మిడ్ మానేరు డ్యామ్‌లో ప్రతిపాదిత ఆక్వా హబ్‌ను ఏర్పాటు చేయడం మత్స్య సంపదకు కీలక మలుపు కానుందని తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి (ఎంఏయూడీ) మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) అన్నారు. దీని ద్వారా పెద్ద సంఖ్య‌లో ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని తెలిపారు.  దాదాపు రూ.2,000 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ సదుపాయం 10,000 మందికి ఉపాధి హామీనిస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో ఆనంద గ్రూప్, ఫ్రెష్ హోమ్, యూఎస్ ఆధారిత సీపీ ఆక్వా గ్రూప్ పెట్టుబడి పెట్టనున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సిరిసిల్ల ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగిస్తూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు ప్రతి భారతీయుడు ఎంతగానో రుణపడి ఉంటాడ‌ని అన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. ఆనంత‌రం మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.

ఐదు వేల పవర్ లూమ్ యూనిట్లలో సుమారు రూ.1.2 కోట్లతో జాతీయ జెండాలను తయారు చేసిన సిరిసిల్ల నేత కార్మికులను కొనియాడారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మంత్రి మాట్లాడుతూ.. రైతుబంధు, రైతు భీమా, రైతులకు 24×7 విద్యుత్ సరఫరా వంటి పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. నేత కార్మికుల కోసం మొట్టమొదటిసారిగా బీమా పథకాన్ని ప్రారంభించినందుకు మేము గర్విస్తున్నామ‌ని అన్నారు. ప్రభుత్వం అతిపెద్ద మత్స్య పరిశ్రమను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. మిడ్ మానేర్ డ్యామ్‌లో దేశంలోనే అతిపెద్ద ఆక్వా హబ్‌ను ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన ఫిష్ ఆర్గనైజేషన్‌తో ఎంఓయూ కుదిరింది. ఈ సౌకర్యం 367 ఎకరాల్లో విస్తరించి ఉంటుంద‌న్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios