Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ విద్యుత్ డిస్కంలు చెల్లించాల్సింది రూ. 52 కోట్లే.. లెక్క‌ల‌ను స‌రి చేసుకున్న కేంద్రం

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ డిస్కంల బాకీల విషయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రూ.52.85 కోట్లు ఎల్పీఎస్ చెల్లించాలని శుక్రవారం తెలిపింది.

Telangana Electricity Discoms have to pay Rs. 52 crores only.. A center that corrects the calculations
Author
First Published Aug 20, 2022, 9:36 AM IST

తెలంగాణ విద్యుత్ డిస్కంలు విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ‌లకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల విష‌యంలో కొంత క్లారిటీ వ‌చ్చింది. రెండు రోజుల కింద బకాయిలు రూ.1360 కోట్లుగా చెప్పిన కేంద్రం తాజాగా వాటిని స‌వ‌రించింది. కేవ‌లం రూ.52 కోట్లు మాత్ర‌మే బాకీ ఉన్న‌ట్టు చెప్పింది. అయితే దీనిపై కూడా డిస్కంలు అభ్యంత‌రం తెలుపుతున్నాయి. ఆ మొత్తం కూడా బకాయిలు లేవ‌ని చెబుతున్నాయి. 

శ్రీకృష్ణజన్మాష్టమి 2022 : మధుర ఆలయంలో అర్థరాత్రి భక్తుల రద్దీ, ఊపిరాడక ఇద్దరు మృతి

రాష్ట్ర డిస్కంలు రెండు రోజుల క్రితం నాటికి ఎల్పీఎస్ కింద 52.85 కోట్లు చెల్లించాల్సి ఉంద‌ని కేంద్రం చెప్పింది. అయితే అంత‌కు ముందు కొన్ని రాష్ట్రాలు బకాయిల విష‌యంలో కేంద్రానికి లెక్క‌లు స‌మ‌ర్పించాయి. వీటిని చూసిన కేంద్రం అధిక బాకీలు ఉన్న 13 రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు చేయ‌కుండా నిషేధం విధించాయి. అయితే లెక్క‌ల‌న్నీ స‌రిచూసుకున్న త‌రువాత ప‌లు రాష్ట్రాల‌పై ఉన్న ఆంక్ష‌ల‌ను తొల‌గించింది. కానీ తెలంగాణ రాష్ట్రంపై ఇంకా ఆ నిషేధం అలానే ఉంది. 52.18 కోట్లు క్లియ‌ర్ చేస్తేనే ఆ నిషేధం ఎత్తేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

హైదరాబాద్ లో దారుణం... బిర్యానీ తిని మృతి చెందిన బాలుడు...

అంత మొత్తం కూడా ఎల్పీఎస్ ఉండ‌ద‌ని డిస్కంలు చెబుతున్నాయి. ఈ చ‌ర్చ‌ల వ‌ల్ల నిన్న 20 ఎంయూ క‌రెంట్ ను కొనుగోలు చేయ‌లేక‌పోయాయి. అయితే నేడు కూడా దానికి ప‌ర్మిష‌న్ వ‌స్తుందో లేదో తెలియ‌డం లేదు. అయితే రెండు రోజుల కింద 13 వంద‌ల 60 కోట్లు బాకీలు ఉన్న‌ట్టు చెప్పిన కేంద్ర అంత‌లోనే దానిని 52 కోట్ల‌కు ఎలా త‌గ్గించాయ‌ని డిస్కంలు ప్ర‌శ్నించాయి. లెక్క‌ల్లో తేడాలు రావ‌డం వ‌ల్లే ఇది జ‌రిగింద‌ని కేంద్రం చెప్పింది. అయితే లెక్క‌లు స‌రి చూసుకున్న త‌రువాత నిషేధం ఉన్న రాష్ట్రాల నుంచి ప‌లు రాష్ట్రాల‌ను తొల‌గించింది. ఇందులో ఏపీ, మ‌ణిపూర్, బీహార్, మ‌హారాష్ట్ర‌లు ఉన్నాయి. మ‌న రాష్టంతో పాటు ఇంకా ప‌లు రాష్ట్రాల‌పై ఆ ఆంక్ష‌లు అలాగే కొన‌సాగుతున్నాయి. 

ప‌లు రాష్ట్రాల్లోని విద్యుత్ డిస్కంలు టైం కు పేమెంట్స్ చేయ‌క‌పోవ‌డంతో కెన్కోల మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతోంద‌ని కేంద్రం చెబుతోంది. సాధార‌ణంగా డిస్కంలు క‌రెంటు కొన్న త‌రువాత 45 రోజుల్లోగా దానికి సంబంధించిన చెల్లింపులు జ‌ర‌పాలి. ఆ స‌మ‌యం దాటిటే ఎల్పీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇవి చెల్లించ‌డం లేద‌ని తెలంగాణ క‌రెంటు కొనుగోలు జ‌ర‌ప‌కుండా కేంద్రం నిషేధం విధించింది. అంత బాకీలు లేవ‌ని డిస్కంలు చెబుతున్నాయి. దీనిపై న్యాయస్థానాల్లో పోరాడాల‌ని ఆలోచ‌న చేస్తున్నాయి. 

రాష్ట్రంలో వందశాతం ఇళ్లకు తాగునీరు.. ఓడీఎఫ్ ప్లస్ లో తెలంగాణ టాప్.. కేంద్ర జలశక్తిశాఖ వెల్లడి...

అయితే తాజా ప‌రిణామాల వ‌ల్ల ప్ర‌స్తుతానికి అయితే తెలంగాణకు పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవ‌కాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న జ‌ల విద్యుత్ కేంద్రాల్లో ఉత్ప‌త్తి జ‌రుగుతోంది. అందుకే నిన్న క‌రెంటు కొనుగోలు చేయ‌లేక‌పోయినా కోత‌లు ప‌డలేదు. పైగా ఇప్పుడు వ‌ర్షాలు కురుస్తున్నందున వ్య‌వసాయానికి కూడా క‌రెంటు డిమాండ్ అధికంగా లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios