శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో కొద్దిసేపటి క్రితం జరిగిన పేలుడుపై తెలంగాణ విద్యుత్ శాఖ స్పందించింది. అది ప్రమాదం కాదని మాక్ డ్రీల్ అని ప్రకటించింది.

అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలో సిబ్బందికి శిక్షణ ఇచ్చామని అధికారులు వెల్లడించారు. విద్యుత్ శాఖ ప్రకటనతో ప్రభుత్వ వర్గాలు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read:బ్రేకింగ్: శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో మరోసారి భారీ పేలుడు... ఎగిసిపడుతున్న మంటలు

కాగా మంగళవారం సాయంత్రం సమయంలో కరెంట్ కేబుల్ మీదుగా డీసీఎం వ్యాన్ వెళ్లడంతో శ్రీశైలం పవర్ ప్లాంట్‌లో పెద్ద ఎత్తున పేలుళ్లు సంభవించాయి. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందితో పాటు ప్రజలు పరుగులు తీశారు.

ఆగస్టు 21న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది ఉద్యోగులు మరణించిన సంగతి తెలిసిందే.