తెలంగాణ ఎన్నికలు 2023 : చివరిరోజు ప్రచారంలో అగ్రనేతలు.. ఏఏ పార్టీల నుంచి ఎవరెవరు? ఎక్కడెక్కడ?

నేడు తెలంగాణ ఎన్నికల ప్రచార చివరిరోజు వివిధ రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్యమంత్రులు, అగ్రనేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక, రాహుల్ లు కూడా తెలంగాణలోనే ఉన్నారు. 

Telangana Elections 2023 : Who are the top leaders in the last day of campaigning - bsb

హైదరాబాద్ : నేటితో  తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకి  ప్రచార గడువు ముగుస్తుంది. దీంతో నగరం మూగబోనుంది. ఇన్ని రోజులు ప్రచారంతో హోరెత్తించిన పార్టీలన్నీ..  ఓటరు దేవుళ్ళు తమకే ఓటు వేయాలని మొక్కుకోవడం మినహా ఇప్పుడు చేసేదేం లేదు.  తెలంగాణ ఎన్నికల బరిలో 2290 మంది  ఉన్నారు. 221 మంది మహిళలు  ఉన్నారు. పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్రవ్యాప్తంగా 35655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.  తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా భద్రతా విధుల్లో 45000 మంది పోలీసులు పాల్గొననున్నారు. మరోవైపు ఈరోజు సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కూడా  రాజకీయ ప్రకటనలకు అనుమతి లేదంటూ ఈసీ పేర్కొంది.

ఇక ప్రచారం చివరి రోజు ఎసిసి అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాదులో రోడ్ షో నిర్వహించనున్నారు.  కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు.  10 గంటలకు జూబ్లీహిల్స్ లో రోడ్ షోలో పాల్గొంటారు రాహుల్ గాంధీ. తరువాత మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లిలో రోడ్ షో, మధ్యాహ్నం రెండు గంటలకు మల్కాజిగిరి ఆనంద్ భాగ్ చౌరస్తాలలో రాహుల్ రోడ్ షో నిర్వహిస్తారు. కార్నర్ మీటింగ్లో పాల్గొని ఎన్నికల ప్రచారం  చేస్తారు. సంగారెడ్డి జిల్లాలో ఏఐసీసీ సెక్రటరీ ప్రియాంక గాంధీ పర్యటిస్తారు. జహీరాబాద్ లో జరిగే కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు  కామారెడ్డి, దోమకొండ, బీబీపేట్ రోడ్ షోలో పాల్గొంటారు.

Top Stories : రైతుబంధు నిలిపివేత.. శ్రీవారి సన్నిధిలో ప్రధాని..ప్రచారంలో అగ్రనేతలు..పోలింగ్ కు అంతా సిద్ధం..

ఇక సిద్దిపేట జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పర్యటిస్తారు.వరంగల్, గజ్వేల్ లలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. మరోవైపు  ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా నేడు మెదక్ సిద్దిపేట జిల్లాలో  ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. చేగుంట, సిద్దిపేటల్లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 

కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలంగాణలో బిజెపి నేతలకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటారు. హనుమకొండ బిజెపి అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా ఆమె విస్తృత ప్రచారం చేయనున్నారు. నిజామాబాద్ అర్బన్ లో తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షులు అన్నామలై ప్రచారం చేస్తారు. కేంద్ర మంత్రి భగవత్ ఖూబాజీ సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొంటారు. ఇక మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేటలలో  ప్రచారంలో పాల్గొంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆదిలాబాద్, ధర్మపురి నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios