Telangana Elections 2023: ఓటు వేయాలంటే ఓటర్ స్లిప్ తో పాటు ఈ గుర్తింపు కార్డుల్లో ఒకటి ఉండాల్సిందే..
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో ఓటు వేయడానికి చెల్లుబాటు అయ్యే వివిధ పత్రాల జాబితాను ఎన్నికల కమిషన్ (ఈసీ) వెల్లడించింది. e-EPIC లేదా ఓటరు సమాచార స్లిప్‌లతో పాటు ప్రభుత్వ గుర్తింపు ఉన్న కార్డులను తీసుకెళ్లాలని పేర్కొంది.
Telangana Assembly Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఓటు వేసేందుకు సరైన డాక్యుమెంట్ల జాబితాను ప్రజలు తెలుసుకోవడం చాలా అవసరం. ఓటర్లు తమ ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (EPIC) లేదా ఇతర 12 డాక్యుమెంట్లలో ఏదో ఒకదాన్ని పోలింగ్ కేంద్రాల్లో చూపించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం (ఈసీ) తెలిపింది. ఈ-ఎపిక్, ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగించుకోవచ్చనీ, వాటిని పోలింగ్ కేంద్రంలో గుర్తింపు రుజువుగా సమర్పించడానికి వీల్లేదన్నారు. ఓటరు స్లిప్, ఓటరు ఐడీతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలి. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయడానికి అవసరమైన 13 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి తీసుకెళ్లాలి.
ఎన్నికల సంఘం సూచించిన 13 గుర్తింపు కార్డులు ఇవే..
1. ఓటరు ఐడీ కార్డు (EPIC) ఒరిజినల్
2. ఆధార్ కార్డు
3. MNREGA జాబ్ కార్డ్ (గ్రామీణ ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు)
4. ఫోటోతో బ్యాంక్ లేదా పోస్టాఫీసు జారీ చేసిన పాస్‌బుక్
5. ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డ్
6. వాహనం నడపడానికి చట్టబద్ధమైన అర్హత కలిగిన గుర్తింపు కార్డు (డ్రైవింగ్ లైసెన్స్)
7. పాన్ కార్డ్
8. ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్ కార్డు
9. పాస్ పోర్ట్
10. ఫోటోతో కూడిన పెన్షన్ గుర్తింపు కార్డు
11. సర్వీస్ ఐడెంటిటీ కార్డు
12. అధికారిక గుర్తింపు కార్డు (Official identity card)
13. ప్రత్యేక వైకల్యం గుర్తింపు కార్డు (UID)
అలాగే, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరు.
- Aadhar Card
- BJP
- BRS
- Congress
- Election Commission
- Kalvakuntla Chandrashekar Rao
- Kishan Reddy
- PAN Card
- Passport
- Pension Card
- Revanth Reddy
- Telangana Assembly Election Results 2023
- Telangana Assembly Elections 2023
- Telangana Election Results
- Telangana Elections 2023
- Telangana Polling
- Voter Card
- Voters
- Votes
- polling station
- telangana election poll